కృష్ణా జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. జిల్లాలో రెండు పార్లమెంటు, 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మైలవరం, మచిలీపట్నం, తిరువూరు నుంచి రాష్ట్ర మంత్రులు పోటీ చేస్తున్నారు. మైలవరం నుంచి రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, వైసీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్‌ పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేయనంత ఖర్చును ఇక్కడ వైసీపీ నాయకులు చేస్తున్నారు. గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ తొక్కుతున్నారు. ఏకంగా పోలీసులను సైతం ప్రలోభపెడుతూ అడ్డంగా దొరికిపోయారు. ఎలాగైనా మంత్రి దేవినేని ఉమను ఓడించాలన్న లక్ష్యంతో ఆర్థికంగా బలమైన అభ్యర్థిని వైసీపీ అధిష్ఠానం ఏరికోరి బరిలో దింపింది. అయినా ఇక్కడ టీడీపీ దూసుకుపోతోంది.

krishna 02042019

పట్టిసీమతో నియోజకవర్గంలోని రైతులు సిరులు పండించు కుంటున్నారు. మరోవైపు చింతలపూడి ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో ఇక్కడ టీడీపీ గెలుపు నల్లేరు మీద నడకగా విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్‌ అడ్డగోలు మాటలను ఖండించడంలో ముందుండే రాష్ట్ర మంత్రి బరిలో ఉండటం.. మరోవైపు గెలుపు కోసం వైసీపీ చేస్తున్న భారీ ఖర్చుతో ఈ నియోజకవర్గం పందెపురాయుళ్లకు హాట్‌సీట్‌గా మారింది. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందని లక్షల్లో పందేలు జరుగుతున్నాయి. మరోవైపు దేవినేని ఉమకు ఎంత మెజారిటీ వస్తుందన్న దానిపైనా జోరుగా పందేలు సాగుతున్నాయి. తిరువూరులో రాష్ట్ర మంత్రి కేఎస్‌ జవహర్‌ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి కొక్కిలిగడ్డ రక్షణ నిధి పోటీలో ఉన్నారు. ఇక్కడ ఇరుపక్షాల నడుమ పోటీ తీవ్రంగా ఉంది. దీంతో ఈ స్థానంపైనా జోరుగా పందేలు సాగుతున్నాయి.

krishna 02042019

మచిలీపట్నం నుంచి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ అభ్యర్థిగా పేర్ని నాని వైసీపీ అభ్యర్థిగా పోటీపడుతున్నారు. ఇక్కడ జనసేన అభ్యర్థిగా బండి రామకృష్ణ పోటీలో ఉన్నారు. ముగ్గురూ బలమైన అభ్యర్థులు కావడంతో మచిలీపట్నంపైనా అందరి దృష్టి కేంద్రీకృతమైంది. జనసేన అభ్యర్థి చీల్చే ఓట్లతో ఎవరికి నష్టం కలుగుతుందనే దానిపైనే ఇక్కడ గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. దీంతో ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ ఈ స్థానంపై లక్షల్లో పందేలు కాస్తున్నారు. కొందరైతే జనసేన అభ్యర్థి గెలుస్తారని కూడా పందేలు కాయడం విశేషం. విజయవాడ సెంట్రల్‌లో బొండా ఉమామహేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా మల్లాది విష్ణు పోటీ చేస్తున్నారు. జనసేన, సీపీఎం కూటమి నుంచి చిగురుపాటి బాబూరావు పోటీ చేస్తున్నారు. త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది. గుడివాడలో దేవినేని అవినాష్‌ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి కొడాలి నాని బరిలో ఉన్నారు. దీంతో గుడివాడ గెలుపోటములపై కోట్లాది రూపాయల పందేలు నడుస్తున్నాయి. గన్నవరంలోనూ అదే పరిస్థితి ఉంది. ఈ రెండు స్థానాలపై కోట్లాది రూపాయల పందేలు జరుగుతుండటం గమనార్హం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read