ఎన్నికల ప్రచారం ఉదృతంగా సాగుతుంది. చంద్రబాబు ఎక్కడ చూసినా, రోడ్ షోలతో ఆదరగొడుతున్నారు. అప్పుడప్పుడు జగన్, పవన్ కనిపిస్తున్నారు. సాయంత్రం 6 దాటితే, పవన్ కాని, జగన్ కాని ఒక్క మీటింగ్ లో ఉన్నట్టు కూడా, ఈ ఎన్నికల ప్రచారంలో చూడలేదు. చంద్రబాబు మాత్రం, రాత్రి 10 గంటల దాకా ప్రజల మధ్యే ఉంటున్నారు. ఇంకా 8 రోజులే ప్రచారానికి సమయం ఉండటంతో, నాయకులు మరింత దూకుడు పెంచారు. అయితే, మన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం, ఈ రోజు ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. ఇంత ఉదృతంగా ప్రచారం జరుగుతున్న టైంలో, ఎందుకు బ్రేక్ ఇచ్చారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ప్రతి రోజు ప్రచారం ఆపేసి, హైదరాబాద్ లోటస్ పాండ్ కు వెళ్ళిపోతున్న జగన్, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టటం, వైసీపీ వర్గాలకు కూడా ఇబ్బందిగా ఉంటుంది.
"వరుస సభల కారణంగా ఆయన గొంతు బొంగురుపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది, ఎన్నికల వ్యూహంపై ఆయన మంగళవారం పార్టీ నాయకులతో సమావేశమై చర్చిస్తారు, అలాగే జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. దీనితో పాటు ఇప్పటి వరకు జరిపిన ప్రచార సరళిపై ఆయన పార్టీ నేతలు మంతనాలు జరపనున్నారు." అంటూ వైసీపీ నేత ఒకరు మీడియాకు చెప్పారు. అయితే, తెలుగుదేశం నేతలు మాత్రం వేరే విధంగా స్పందిస్తున్నారు. ఇలాంటి పీక్ టైంలో, ప్రచారం చెయ్యకుండా ఎవరూ ఇంట్లో కుర్చోరు అని, హైదరాబాద్ లో కూర్చుని , కేసీఆర్ తో కలిసి ఎదో కుట్రలు పన్నుతున్నారని, చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.
ఇక మరో పక్క, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేసేశారు. ఇందులో భాగంగానే నేడు (మంగళవారం) చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు చిత్తూరు జిల్లా మదనపల్లెలో, 1.45 గంటలకు చంద్రగిరిలో, 3 గంటలకు నగరిలో తమ పార్టీ అభ్యర్థుల తరపున చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం 4.45 గంటలకు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లిలో, 6.15 గంటలకు వేదాయపాలెంలో చంద్రబాబు రోడ్ షోలో ప్రసంగం చేయనున్నారు.