ప్రధాని నరేంద్రమోదికి ఏపి సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ. కర్నూలులో మోది వ్యాఖ్యలపై భగ్గుమన్న చంద్రబాబు. టిడిపి ఆవిర్భావంనాడే ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతీశారని మండిపాటు. మా ప్రజల మనోభావాలు గాయపర్చే విధంగా వ్యాఖ్యలు చేశారు అభూత కల్పనలు, శుద్ధ అబద్దాలతో మీ వ్యాఖ్యలు అత్యంత హేయం, బాధాకరం. మా అభివృద్ధి అస్తమించాలని ఆక్రోశించారు. మీ అహంకార పూర్వక వ్యాఖ్యలకు ప్రతి ఆంధ్రుడూ ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. వారందరి పక్షాన నేను మీకు ఇస్తున్న సమాధానం. మీరు చాలా కబుర్లు చెప్తారు, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పటంలో మీకు మీరు సాటి. ఆనాడు కాంగ్రెస్ తల్లిని చంపి బిడ్డను బతికించింది అన్నారు. ఆ తల్లి లేని బిడ్డ సంరక్షణ నేను తీసుకుంటాను అని నమ్మించారు. పసి బిడ్డ నవ్యాంధ్ర గొంతు నిలువునా కోశారు. ఆర్థిక నేరస్తులతో కుమ్మక్కై రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేశారు. దేశాన్ని భ్రష్టుపట్టించడమే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలు అన్నింటినీ నిర్వీర్యం చేశారు రైతులను, యువకులను, వ్యాపారులను, మైనారిటీలను మోసం చేశారు, ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన ద్రోహులు మీరు.

modi 31032019

ఒక్క విభజన హామీ కూడా అమలు చేయకుండా మోసంచేశారు. దత్తపుత్రుడికి(జగన్ కు) సాయం చేయడానికే మళ్ళీ రాష్ట్రానికి వచ్చారు. వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి వంచించారు. రూ.లక్ష కోట్లు దోచుకున్న ఆర్థిక నేరస్తులను శిక్షిస్తామన్నారు. కటకటాల వెనుక ఉంచుతానని చెప్పి ఆ మాట నిలబెట్టుకోలేదు. రాష్ట్రం ఏర్పడ్డ తోలి నాలుగేళ్ళు డబుల్ ఇంజిన్ ప్రభుత్వమే ఉంది. కేంద్రం ఇంజన్ డ్రైవర్ అయిన మీరు కేవలం గుజరాత్, ఉత్తర భారతదేశానికే తీసుకెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో మొద్దు నిద్రపోయారు. రాష్ట్ర ఇంజన్ డ్రైవర్‌గా నేను ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి స్టేషన్ వైపు నడిపాను. సూర్యోదయ ఆంధ్రప్రదేశ్‌ అనేది మా రాష్ట్ర అభివృద్దికి సూచిక. ఇక్కడి ప్రజల కష్టపడే తత్త్వం, పట్టుదలకు నిదర్శనంగా పెట్టుకున్నది ఆ పేరు.పునాదుల నుంచి మేము నిర్మింస్తుంటే మీరు అడ్డుగోడలు కట్టారు.కఠోర శ్రమతో ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు, భాగస్వామ్యాలతో అత్యున్నత ప్రగతిని సాధించాం.సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ స్పూర్తిని కించపరుస్తారా..? మా రాష్ట్రాన్ని హేళన చెయ్యడం భావ్యమా.? అసలు సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ పేరు పలికే నైతిక హక్కు మీకు ఉందా? ఈ 5ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి మీరు ఇచ్చిన సహాయ సహకారాలు ఏంటి? ఒక్కటైనా చెప్పగలరా?

modi 31032019

కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల సహకారం లేకే 9వ షెడ్యూల్ సంస్థలలో ఒక్క సంస్థ విభజనా జరగలేదు. పదో షెడ్యూల్‌లోని 142 సంస్థల విభజన ఇప్పటికీ పరిష్కారం కాలేదు. తెలంగాణ విద్యుత్ బకాయిలు రూ.5,732కోట్లు ఇవ్వలేదు. మధ్యవర్తిగా పరిష్కరించాల్సిన మీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. రాజధాని నగరం నిర్మాణానికి రూ.1,500కోట్లు మాత్రమే ఇచ్చారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం మా ఎంపిలు 11రోజులు దీక్షచేసినా మీకు చీమ కుట్టినట్లులేదు. ఏపి భవన్ పంపిణీ 4ఏళ్లయినా చేయలేక పోయారు. డిఫర్డ్ టాక్స్ కలెక్షన్లలో తేడాల వల్ల రూ.3,820కోట్లు నష్టపోయాం. రాజధానిని, అత్యున్నత సంస్థలు, ఉత్పాదక కేంద్రాలు, సేవారంగ కేంద్రాలను కోల్పోయాం. కరవులు, తుఫాన్లు మాత్రం వారసత్వంగా వచ్చాయి. కష్టాలలో ఉన్న రాష్ట్రానికి అండగా నిలుస్తారనే ఆనాడు మీతో కలిసి నడిచాం. ఇప్పుడు కేంద్ర అభివృద్దికి రాష్ట్రం సహకరించలేదనడం మూర్ఖత్వం కాదా..?. 5ఏళ్ల క్రితం మీకు ఓటు వేశారు అన్న ఇంగితం మీకుందా..? అదే ఉంటే ఇంత అన్యాయం చేసేవారా..?. ప్రధాన సేవకుడుగా కాదు మీరు ప్రధాన వంచకుడిగా మారారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read