మంగళగిరి అభివృద్ధి అడ్డుకోటానికి పక్క రాష్ట్రము సాక్షిగా పన్నిన, కుట్రను తెలుగుదేశం నేతలు పక్క ఆధారాలతో పట్టుకున్నూరు. ముఖ్య మంత్రి కుమారుడు నారా లోకేష్ పోటీ చేస్తున్న చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం మీద అందరి ద్రుష్టి కేంద్రీకృతం అయిన సంగతి తెలిసిందే. నన్ను గెలిపిస్తే మంగళగిరి ని మరో గచ్చిబౌలి చేస్తాను అని లోకేష్ విస్తృతంగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గం లో ఒక దఫా ప్రచారం పూర్తీ చేసుకుని జిల్లాల పర్యటనకు లోకేష్ వెళ్లారు. ప్రజలకు ఏమి చేస్తాను అనేది చెప్తూ, అక్కడ ప్రజలని ఆకట్టుకుంటున్నారు. మరో పక్క 12 ఓట్లతో గెలిచి, రాష్ట్రంలో జరిగే ప్రతి మంచి పనికి, లిటిగేషన్ పెట్టే, జగన్ ఆప్తుడు ఆర్కే మరో పక్క ఉన్నారు.
దీంతో, లోకేష్ ని చట్ట సభలోనికి అడుగుపెట్టనీయకూడదు అని వైకాపా ఎత్తులు వేస్తోంది. దీనిలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో ఎప్పుడు చూడని కొత్త వ్యక్తులు మనకి కనిపిస్తున్నారు. వాళ్ళు అందరు పీకే టీం మనుసులు అని నియోజకవర్గంలో అనుకుంటున్నారు. తెలంగాణ రిజిస్ట్రేషన్ తో ఉన్న కార్లు వేసుకుని, మంగళగిరి నియోజకవర్గం లో వైకాపా జెండాతో వాహనాలు తిరుగుతున్నాయి. నల్ల బాట్లతో,ఆ వాహనాల్లో లాప్టాప్ తో కొంత మంది ఉంటున్నారు. వీరు ఇంటి ఇంటికి తిరుగుతున్నారు, ప్రజల వద్ద నుంచి ఆధార్, బ్యాంకు అకౌంట్ లు సేకరిస్తున్నారు. చిన్న చిన్న సమావేశాలు పెడుతున్నారు. అసలు తెలంగాణ నుంచి ట్రాన్స్ పోర్ట్ పర్మిట్ ఉన్న వాహనం వైకాపా జెండా కట్టుకుని నియోజకవర్గం లో ఎలా తిరుగుతోంది ?
ఈ వాహనానికి పర్మిట్ ఎవరు తీసుకున్నారు ? పక్క రాష్ట్రము యువకులు కి ఇక్కడ ఏమి పని ? దీనిని పక్క రాష్ట్రము సాక్షిగా మన రాష్ట్ర అభివృద్ధి ఆడుకోటానికి కుట్ర గానే చూడాలి అని మంగళగిరి లో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. లోకేష్ గెలుపుని అడ్డుకోటానికి ఇలాంటి టీంలుని రంగంలోనికి దించారు. దీని వెనెక పక్క రాష్ట్రము లో పెద్దలు హస్తం ఉంది అని నియోజకవర్గం లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఇది పసిగట్టిన తెలుగుదేశం కార్యకర్తలు, వీళ్ళను కాపు కాసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 7 గురు పీకే సభ్యులని పట్టుకుని, మంగళగిరి పోలీసులకు అప్పగించారు. ఓటు కి 20 వేలు ఇస్తాం అంటూ పీకే టీం దొరికిందని, అందుకే పోలీసులకు అప్పచెప్పామని, వీళ్ళు ఇక్కడ ఏ కుట్ర పన్నారో, విచారణలో తేలుతుందని అన్నారు.