ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏదో అద్భుతం జరగబోతుంది. ఎవరో తమ ఉనికిని పై, భవిష్యత్తు పై దాడి చేస్తున్నట్టు భావించి, తమకు జరిగిన,జరుగుతున్న అవమానాలకు చాలా గట్టిగా సమాధానం చెప్పాలనే సంకల్పం కనిపిస్తోంది. ఎన్నడూ లేనిదీ, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నుంచి బస్సులు ,ట్రైన్ లు ఫుల్ అయిపోయి, వందలాది కిమీ ప్రయాణాన్ని కూడా వెరవక, బస్సులు పైన కూడా ప్రయాణించడం విస్మయం కలగచేస్తుంది. మొన్న ఎవడో అన్నాడు ఆంధ్ర ప్రజలకు నిబద్ధత లేదు అని, వాడి మొహం బద్దలయ్యేలా ఓట్లు గుద్దడానికి యువత కదిలింది. అయితే, ప్రజల్లో ఇంత కసి చూసి విశ్లేషకులు ఆశ్చర్య పోతున్నారు. ఈ కసి చంద్రబాబు పై కోపంతో కాదని, ఈ కసి ఆంధ్రా జాతి పై జరుగుతున్న దాడికి సమాధానం అని, ఇది కచ్చితంగా మోడీ, కేసీఆర్, జగన్ ఫ్రంట్ కు సమాధానం అని అంటున్నారు.
మరో పక్క తెలుగుదేశం పార్టీలో విజయోల్లాసం ఉట్టిపడుతోంది. ఈ రోజు జరిగే పోలింగ్‌లో తమ విజయం ఖాయమేనని, పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆ పార్టీ నాయకత్వం ధీమాతో ఉంది. పోయినసారి కంటే ఈసారి తమకు వచ్చే సీట్లు పెరుగుతాయని, కొన్ని వర్గాలు ఏకపక్షంగా మద్దతు ఇస్తున్నందువల్ల సునాయాసంగా నెగ్గగలమన్న అంచనాలో ఆ పార్టీ వర్గాలు ఉన్నాయి. 3 అంశాల ఆధారంగా తమ విజయం ఖాయమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ‘సంక్షేమ పథకాల లబ్ధిదారులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఈ ప్రభుత్వం వల్ల తమకు మేలు కలిగిందని వారు భావిస్తున్నారు. వారి మద్దతు టీడీపీకి ఏకపక్షంగా ఉంది. ఈసారి ఎన్నికల పోరాటాన్ని ఈ పథకాలు మలుపు తిప్పాయి. బాగా వెనుకపడిన నియోజకవర్గాలు కూడా వీరి మద్దతుతో ముందుకు వచ్చాయి’ అని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు వివరించారు.
చంద్రబాబు రెండోసారి అధికారంలోకి వస్తే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కొనసాగుతుందని, రాష్ట్రం ముందుకు వెళ్తుందన్న విశ్వాసం ప్రజల్లో బలంగా ఉందని, పట్ట ణ ప్రాంతాల్లో మంచి ఆధిక్యం రావడానికి ఈ అంశం తమకు పనికి వస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మోదీ, కేసీఆర్... వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో చేతులు కలిపి చంద్రబాబును దెబ్బ తీయడానికి కు ట్రలు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బాగా వ్యాప్తి చెందిందని, వా రిలో ఇది ఒక సెంటిమెంట్‌గా వ్యా పించడంతో ప్రధాన ప్రతిపక్షం బలహీనపడిందని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రాంతాల వారీగా చూసినప్పుడు పోయినసారి తక్కువ సీట్లు వచ్చిన రాయలసీమలో ఈసారి తమ సంఖ్య పెరుగుతుందని టీడీపీ నేతలు బలమైన విశ్వాసంలో ఉన్నారు. రాయలసీమకు సాగునీటి జలాలు, పరిశ్రమలు రావడంతో ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందని, ఆ ప్రాంతంలో గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లిం మైనారిటీలు ఈ సారి టీడీపీకి మద్దతు ఇవ్వడం మరో కారణమని వారు అభిప్రాయపడుతున్నారు.