ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్నం 12:30కి ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు బృందం కలవనుంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మంత్రులు, ఎంపీలతో సీఎం సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చిస్తున్నారు. అలాగే వీవీ ప్యాట్ల లెక్కింపుపై సుప్రీంలో టీడీపీ రివిజన్ పిటిషన్ వేయనుంది. అయితే చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేస్తారనే సమాచారం కూడా వస్తుంది. అయితే, ఇలా జరిగితే, దేశ వ్యాప్తంగా మోడీ బండారం బయట పడుతుంది అనే ఉద్దేశంతో, చంద్రబాబు కనుక ధర్నా లాంటి నిరసన కార్యక్రమాలు చేస్తే, వెంటనే అరెస్ట్ చెయ్యాలని ఢిల్లీ పెద్దలు ఆదేశించనట్టు తెలుస్తుంది. ఈ సమాచారం తెలుసుకున్న చంద్రబాబు, నిరసన ఎలా తెలపాలి, దేశానికీ మోడీ చేసిన పని ఎలా చెప్పాలి అనే దాని పై సమాలోచనలు జరుపుతున్నారు.

cbn delhi 13042019

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు, హింస, సాంకేతిక సమస్యలనే ఆయుధాలుగా ఎక్కుపెట్టారు. దీంతో ఎన్డీయే రహిత రాజకీయ పార్టీలన్నీ చంద్రబాబు అభ్యంతరాలపై చర్చిస్తున్నాయి. మరోసారి ఒకే వేదికగా పోరాటం సాగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఘోరంగా విఫలమైందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈవీఎంలు పనిచేయక లక్షలాది మంది ఓటర్లు మండుటెండలో నానా ఇబ్బందులు పడ్డారని అర్థరాత్రి వరకూ పోలింగ్ నిర్వహణతో ఎన్నో అవస్థలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ, బీజేపీ పిర్యాదు చేస్తే ఆఘమేఘాలపై అధికారులను బదిలీ చేయడం తప్ప ఈసీ సరైన పద్ధతిలో ఓటింగ్ నిర్వహణకు బాధ్యత తెలపలేదని తప్పుబట్టారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేశారని తప్పుబట్టే పరిస్థితిని తీసుకొచ్చారని అనుమానించే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు.

cbn delhi 13042019

హస్తిన వేదికగా సాగుతున్న వ్యవహారాలపై కన్నెర్రజేశారు. ఢిల్లీ వేదికపైనే తేల్చుకుంటానని తేల్చి చెప్పారు. ఓవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు ఎన్నికల కమిషన్‌ అధికారాల దుర్వినియోగంపై కార్యాచరణ రూపొందించబోతున్నట్లు స్పష్టం చేశారు. 'సేవ్‌ డెమోక్రసీ... సేవ్‌ నేషన్‌' నినాదంగా అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేస్తానని ప్రకటించారు. రాజ్యాంగం కల్పించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చకుండా.. అధికారాలను దుర్వినియోగం చేస్తున్న బండారాన్ని బట్టబయలు చేస్తానని చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యఘట్టమైన ఎన్నికల నిర్వహణను బాధ్యతారాహిత్యంగా మార్చేశారని మండిపడ్డారు. తమకున్న అధికారాలను వినియోగించుకొని బాధ్యతలు నెరవేర్చాల్సిన ఈసీ.. తన విధులు పక్కనబెట్టి.. మోదీ కనుసన్నల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకే దేశాన్ని కాపాడుకుందాం.. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో ఢిల్లీ వెళ్తున్నానని చంద్రబాబు చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read