20 రోజుల పాటు కృష్ణా నదికి కొట్టిన వరదలు ఆగిపోయాయి. కృష్ణమ్మ శాంతించింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు మూసుకు పోయాయి. అయితే ఒక్క చోట మాత్రం, ఒకే ఒక గేటు ఇంకా తెరిచే ఉంది. అక్కడ నుంచి సముద్రంలోకి నీరు వృధాగా పోతుంది. ప్రకాశం బ్యారేజీ దగ్గరకు వెళ్ళిన ప్రజలకు, ప్రకాశం బ్యారేజీ దగ్గర అన్ని గేట్లు మూసుకుపోయి కనిపించినా, ఒక్క గేటు మాత్రం ఇంకా తెరిచే ఉంది. అక్కడ నుంచి నీళ్ళు వృధాగా కిందకు పోతున్నాయి. సముద్రంలోకి వృధాగా వెళ్ళిపోతున్నాయి. పులిచింతల గేట్లు మూసేసారు. ప్రకాశం బ్యారేజి గేట్లు మూసేసారు. అక్కడ 3 టియంసీ నీళ్ళు నిలువ చెయ్యాలి. కాని, ఇలా వృధాగా ఒక గేటు తెరిచి, ఎందుకు నీళ్ళు వాడులుతున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. ఊరికే నీళ్ళు సముద్రంలోకి వదిలేస్తున్నారని ప్రజలు బాధపడుతున్నారు.
అయితే, ఈ విషయం తెలియటంతో, నిన్న కృష్ణా జిల్లా కలెక్టర్ అక్కడకు వెళ్లి చూసారు. ప్రకాశం బ్యారేజీ 68వ పిల్లర్ వద్ద గేటు తెరిచి ఉందని, అక్కడ నుంచి నీళ్ళు వృధాగా పోతున్నాయని గమనించారు. విషయం పై ఆరా తీసారు. మొన్న వరదలకు ఒక పెద్ద ఇసుక బోటు వచ్చి, 68వ పిల్లర్ వద్ద ఇరుక్కు పోయింది. అయతే ఇప్పుడు వరద తగ్గటంతో, అది బయట పడింది. ఆ పెద్ద ఇసుక బోటు, వెళ్లి బ్యారేజీ గేటుని గట్టిగా గుద్దుకోవటంతో, అక్కడే ఇరుక్కు పోయింది. దీంతో, అన్ని గేట్లు వేసినా, ఈ గేటు మాత్రం కిందకు దిగటం లేదు. అక్కడ ఒక పెద్ద ఇసుక బోటు ఉండటంతో, వీలు కావటం లేదు. ఇసుక బోటు అంటే ఎదో పడవ లాగా ఉంది అనుకునేరు, దాదపుగా 25-30 లారీలకు సరిపడా ఇసుక తీసుకుచ్చెంత పెద్ద ఇసుక పడవ..
అయితే ఈ బోటు వల్ల గేటు కిందకు దిగటం లేదు అని తేల్చిన కృష్ణా జిల్లా కలెక్టర్, అక్కడ ఉన్న ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. నీరు వృధాగా పోతుందని, తొందరగా, ఆక్కడ నుంచి బోటుని తియ్యాలని ఆదేశించారు. బోటు తొలగించే సమయంలో, బ్యారేజీ పిల్లర్లకు కానీ, గేట్లకు కాని నష్టం కలగకుండా చూడాలని అన్నారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు, ఇది కుట్ర కోణం కాదా ? అని ప్రశ్నించారు. మొత్తం ఇలాంటివి మూడు పెద్ద ఇసుక పడవలు, బ్యారేజీకి అడ్డంగా వేసారని, ఇప్పుడు అందులో ఒకటి బ్యారేజీకే ఇబ్బంది అయ్యే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. వీళ్ళు చేసే పనుల వల్ల, ఎలాంటి నష్టం వాటిల్లిందో చూడండి అంటున్నారు. బ్యారేజీకి అడ్డంగా బొట్లు వెయ్యటం పై, నారా లోకేష్ కూడా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది కుట్ర కోణంలో చేసినా, పొరపాటున వచ్చినా, గత రెండు రోజుల నుంచి, అక్కడ పడవ ఉండటం వల్ల, నీళ్ళు సముద్రంలోకి వెళ్తున్నాయి. ప్రభుత్వం వెంటనే, అక్కడ నుంచి బోటు తీసి, బ్యారేజీ గేటు మూసే ప్రయత్నం చెయ్యాలి.