గత 5 ఏళ్ళ కాలంలో చంద్రబాబు ఎంత కష్టపడి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చారో, అందరికీ తెలుసు. చంద్రబాబు కష్టమే, మొన్న జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలు రిలీజ్ చేసిన కియా కారు. అయితే గత 5 ఏళ్ళలో మాత్రం, ప్రతిపక్షంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం, చంద్రబాబు ఒక్క కంపెనీ కూడా తీసుకు రాలేదని ఎద్దేవా చేసారు. చంద్రబాబు విదేశీ పర్యటనలకు ఎంజాయ్ చెయ్యటానికి వెళ్తున్నారని ఆరోపణలు చేసారు. ఇక జగన మోహన్ రెడ్డి గారు అయితే, ప్రత్యెక హోదా కోసం పోరాడకుండా, ఈ ఉత్తుత్తి విదేశీ పర్యటనలు ఎందుకు చంద్రబాబు, నీ సుందర మొఖం చూసి, ఎవరైనా పెట్టుబడులు పెడతారా చంద్రబాబు అంటూ, హేళన చెయ్యటం చూసాం. ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు ఒక్క కొత్త ఉద్యోగం కూడా తేలేదు అని ప్రచారం చేసారు.
కాని వాస్తవంలో చూస్తే, పరిస్థితి వేరు. మన రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. మౌలిక వసతులు లేవు. రాజధాని లేదు. అయినా దేశం మొత్తం మన గురించి మాట్లాడుకునేలా చేసారు చంద్రబాబు. ఒక పక్క మొబైల్ కంపెనీలు, మరో పక్క ఎలక్ట్రానిక్ కంపెనీలు, మరో పక్క ఆటోమొబైల్ ఇండస్ట్రీతో పాటు, చిన్న చిన్న ఐటి కంపెనీలు తేవటంలో సక్సెస్ అయ్యారు. పక్క రాష్ట్రాలు ఎంతో బలంగా ఉన్నా, వారిని కాదని, మన రాష్ట్రానికి వచ్చారు అంటే, అది చంద్రబాబు బ్రాండ్ అని చెప్పటంలో ఆశ్చర్యం లేదు. అయినా సరే, జగన్ మోహన్ రెడ్డి గారు అప్పట్లో రాజకీయం చేసారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. పెట్టుబడులు పెట్టటం పై అనిశ్చితి నెలకొంది.
ఇలాంటి సమయంలోనే , జగన్ ప్రభుత్వం, గత 5 ఏళ్ళ కాలంలో ఎన్ని కంపెనీలు వచ్చాయో చెప్తూ, శ్వేతపత్రం విడుదల చేసింది. శ్వేత పత్రంలో అబద్ధాలు ఆడటానికి ఉండదు, అన్నీ నిజాలే చెప్పాలి. ఇప్పటికే ఆర్ధిక రంగం మీద శ్వేతపత్రం వదిలి, చంద్రబాబు ఎంత బాగా పని చేసారో, ఆ రిపోర్ట్ లోనే వివరించారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ మీద ఉన్న శ్వేతపత్రంలో కూడా, చంద్రబాబు పని తీరు ఎంత బాగుందో తెలుస్తుంది. నెల రోజుల క్రితం, శాసనసభ సాక్షిగా పరిశ్రమల శాఖ ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల ద్వారా 30,428 ఉద్యోగాలు వచ్చాయని వాళ్ళే చెప్పారు. ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న 137 కంపెనీల ద్వారా 2,78,586 ఉద్యోగాలు, మెగా ప్రాజెక్ట్స్ ద్వారా 1,33,898 ఉద్యోగాలు వస్తున్నాయని శ్వేత పత్రం ద్వారా బయటపెట్టారు. అంటే 'బాబు వచ్చారు...జాబు వచ్చింది' అని స్వయంగా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ప్రకటించింది.