పవిత్ర తిరుమలలో మరోసారి, అన్యమత ప్రచారంతో కలకలం రేగింది. పవిత్రమైన తిరుమల కొండ పై, వేరే మతాల ప్రచారం చెయ్యటం నిషేధం అని తెలిసిందే. అయితే, గత రెండు నెలల నుంచి, ఎదో ఓక అంశంలో తిరుమల వార్తలకు ఎక్కుతూనే ఉంది. అయితే ఈ రోజు తిరుమలలో జరిగిన అన్యమత ప్రచారంతో, ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. ఇంకా చెప్పే విషయం ఏమిటి అంటే, ఏకంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో, ఏకంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మైనారిటీ శాఖ ఈ ప్రకటన ఇవ్వటంతో, అక్కడ ఉన్న ప్రజలు అవాక్కయ్యే పరిస్థితి వచ్చింది. ఇది తిరుమల కొండ అనుకుంటున్నారా,ఏంటి అంటూ, భక్తులు ఆందోళన చెయ్యటంతో, అధికారులు ఎంటర్ అయ్యి, జరిగిన విషయం పై ఆరా తీసారు. పొరపాటు అయ్యింది అని, మరోసారి జరగకుండా చూస్తామని అన్నారు.

tirumala 22082019 2

విషయం ఏమిటి అంటే, ఈ రోజు తిరుపతి నుంచి తిరుమల వెళ్ళే బస్సుల్లో ఇచ్చిన టికెట్ల వెనుక, భాగంలో ముస్లింల పవిత్ర హజ్ యాత్ర, క్రిస్టియన్ల పవిత్ర జెరూసలేం యాత్రకు సంబంధించిన యాడ్స్ దర్శనమిచ్చాయి. ఈ యాడ్స్ ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, మైనారిటీ సంక్షేమ శాఖ. అయితే ఇవి చూసిన భక్తులు, వెంటనే గొడవ మొదలు పెట్టారు. తిరుమల కొండ పై అన్యమతాల ప్రచారం పై నిషేధం ఉన్నా, జరూసలేం యాత్రల పై ఎలా ప్రచారం చేస్తారని మండిపడ్డారు. ఆందోళనకు సిద్ధం అయ్యారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ, ఏకంగా ప్రభుత్వమే ఇలా యాడ్స్ ఇస్తే ఎలా అంటూ నిలదీసారు. ఎవరో ప్రైవేటు వ్యక్తులు చేస్తే అనుకోవచ్చు, ప్రభుత్వమే ఇలా చెయ్యటం హేయం అని, హిందువుల మనోభావాలతో పని లేదా అని ప్రశ్నించారు.

tirumala 22082019 3

అయితే ఈ ఘటన పై భక్తుల ఆందోళన తీవ్రం అవ్వటంతో, ఆర్టీసీ డిపో మేనేజర్ రంగంలోకి దిగారు. వేరే ప్రాంతానికి వెళ్లాల్సిన టికెట్ రోల్, పొరపాటున తిరుమల వచ్చిందని ఆర్టీసీ డిపో మేనేజర్ అన్నారు. భక్తుల ఫిర్యాదుతో టికెట్ రోల్ అధికారులు మార్చేసారు. తిరుమల రాంబగీచా బస్టాండ్ టికెట్ కౌంటర్‍లో ఈ ఘటన జరిగింది. అయితే, అధికారుల సమాధానం పై భక్తులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పొరపాటున వచ్చింది కాదని, దీని వెనుక ఎవరో ఉన్నారని అంటున్నారు. తిరుమల లాంటి చోట, పోరపాటున ఇలాంటివి జరగవని అంటున్నారు. మరోసారి ఇలాంటివి జరిగితే, తీవ్రంగా ఉంటాయని, హిందూ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే, జగన్ యాంటీ హిందూ అంటూ ప్రచారం మొదలు పెట్టిన బీజేపీ, దీని పై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read