అమరావతిని మార్చేస్తారంట కదా ? మంత్రి బొత్సా ప్రకటన తరువాత, నిన్నటి నుంచి ఇదే చర్చ. అమరావతిని ప్రేమించే వారికి, ఇది నిజంగా చేదు వార్తా. అమరావతిని ద్వేషించే బ్యాచ్ కు మాత్రం, పండగ లాంటి వార్తా. అయితే అమరావతికి కర్త, కర్మ, క్రియ అయిన చంద్రబాబు, ఈ వార్తలు విని, స్పందించారు. నిన్న కృష్ణా వరద వచ్చిన ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్న సామయంలోనే ఈ వార్త వచ్చింది. అప్పటికే ప్రజల మధ్య ఉన్న చంద్రబాబుకు, మంత్రి ప్రకటన పై, చంద్రబాబుకు బ్రీఫ్ చేసారు. అయితే, చంద్రబాబు ఈ వార్త విన్న వెంటనే, ప్రజల మధ్యకే వచ్చి స్పందించారు. ఇప్పుడే వార్తల్లో వస్తుంది, అమరావతి గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటూ మంత్రి బొత్సా మాట్లాడారు అంటూ, చంద్రబాబు స్పందించారు. వరదను కావాలని నిలుపదల చేసి, ఇప్పుడు వరద ప్రాంతం అనే ముద్ర వేసి, రాజధానిని తరలించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం 3 టీఎంసీలు అయితే, అమరావతి ప్రాంతం, నా ఇల్లు ముంచాలని, 4 టీఎంసీల నీటిని బ్యారేజీలో నిల్వ ఉంచారు. అయినా అమరావతికి ఏమి అవ్వలేదు, నా ఇల్లు మునగలేదు. కాని, పేద ప్రజలని ముంచేసారు అని చంద్రబాబు అన్నారు. 4 టీఎంసీల నీటిని ఉంచి, ప్రకాశం బ్యారేజీనే ప్రమాదకర పరిస్థితులకు తీసుకువెళ్ళారని అన్నారు. నా ఇల్లు పొతే, ఆ ఇంటి ఓనర్ కు ఇబ్బంది, అక్కడ వస్తువులున్న నాకు ఇబ్బంది, కాని ఇప్పుడు మాకు ఏమి అవ్వలేదు కాని, పేదల కడుపు కొట్టారని అన్నారు. ఇంతా చేసి, అమరావతికి వరద ముప్పు ఉంది, దాని కోసం చాలా ఖర్చు పెట్టాలి, చాలా ఖర్చు పెడితే ప్రజాధనం వృధా అవుతుంది, అందుకే ఆలోచిస్తున్నాం అని ప్రభుత్వం చెప్తుందని, కాని ఇది తప్పు అని చంద్రబాబు అన్నారు.
అమరావతి కోసం, ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదని అన్నారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా అమరావతి నిర్మాణానికి రైతులు 33వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారని, గుర్తు చేసారు. అన్ని మౌలిక సదుపాయాలు, రైతులకు ఇచ్చే భూమి పోగా, ప్రభుత్వానికి 8 వేల ఎకరాలు మిగులుతుందని, ఆ భూమి అమ్ముకుంటే, రాజధాని నిర్మాణం తేలికగా పూర్తీ అవుతుందని అన్నారు. తరువాత, అదే ఆదాయం తెచ్చి, రాష్ట్రానికి గుండెకాయ అవుతుందని అన్నారు. కాని ప్రభుత్వానికి వేరే కుట్ర ఆలోచనలు ఉన్నాయని, అందుకే రాజధానిని మార్చే ఆలోచనతోనే, కుట్ర చేసి, ఇక్కడకు వరదలు వచ్చేలా ప్లాన్ చేసారని చంద్రబాబు అన్నారు. ఖర్చు ఎక్కువ అంటూ అమరావతిని పూర్తిగా నిలిపివేసే ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై ఎంతవరకైనా పోరాడతానని చంద్రబాబు స్పష్టం చేశారు.