జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై, ప్రధాని మోడీకి కంప్లైంట్ లు వెళ్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రిందట, విద్యుత్ ఒప్పందాల విషయంలో, జగన్ మోహన్ రెడ్డి వైఖరి వల్ల, పెట్టుబడులు దెబ్బతింటున్నాయి అని, ఇలా అయితే, జపాన్ నుంచి ఎవరూ మీ దేశంలో పెట్టుబడులు పెట్టరు అంటూ జపాన్ ప్రభుత్వం నుంచి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అలాగే విద్యుత్ ఒప్పందాల విషయంలో, అనేక ప్రముఖ కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసాయి. ఇప్పుడు తాజాగా "ది అసోసియేషన్ అఫ్ ఇండియన్ మెడికల్ డివైజ్ ఇండస్ట్రీ", జగన్ మోహన్ రెడ్డి పై, ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసారు. వైజాగ్ మెడ్ టెక్ జోన్ విషయంలో జరిగిన విషయం ప్రస్తావిస్తూ, ఇలా అయితే మీరు తీసుకున్న మేక్ ఇన్ ఇండియా స్పూర్తి దెబ్బ తింటుంది అని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రాజీవ్ నాథ్ ఆధ్వర్యంలో మోడీని కలిసి ఫిర్యాదు చేసారు.

medtech 21092019 2

చంద్రబాబు హయంలో, విశాఖను మెడికల్‌ హబ్‌గా తీర్చి దిద్దాలి అనే లక్ష్యంతో, దేశంలోనే మొదటి మెడ్‌టెక్ జోన్‌ను చంద్రబాబు ఏర్పాటు చేసారు. దీనికి కేంద్ర సహకారం కూడా ఇచ్చింది. పెదగంట్యాడ మండలం మదీనాబాగ్‌ ప్రాంతంలో 270 ఎకరాల్లో మెడ్‌టెక్‌ జోన్‌ను చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చిన్న సూది నుంచి పెద్ద వైద్య పరికరాలు దాకా ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ 80 పైగా దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు ఉత్పత్తి మొదలు పెట్టాయి. వైద్య పరికరాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా, ఈ మెడ్ టెక్ జోన్ ఉపగాయోగ పడనుంది. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే, ఇది మెడ్ టెక్ జోన్ కాదు, ఇది ఒక మయసభ అంటూ, దీని పై విచారణకు ఆదేశించారు. అంతే కాదు, ఈ మెడ్ టెక్ జోన్ కు అన్నీ తానై నడిపించిన, మ్యానేజింగ్ డైరెక్టర్ జితేందర్ శర్మను, జగన్ ప్రభుత్వం తొలగించింది.

medtech 21092019 3

అయితే, ఈ నిర్ణయంతో అందరూ అవాక్కయ్యారు. ఎందుకంటే, డాక్టర్ జితేందర్ శర్మకు మరెక్ట్ లో మంచి పేరు ఉంది. డాక్టర్ జితేందర్ శర్మను ఐక్యరాజ్యసమితితో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఇచ్చింది. అయితే కేవలం చంద్రబాబు పెట్టారు, ఈయన సహకరించారు అనే కక్షతో, డాక్టర్ జితేందర్ శర్మని జగన్ ప్రభుత్వం తప్పించింది అని, మెడ్ టెక్ జోన్ ఏర్పాటులో, అయన సేవలు ఎనలేనివి అని, వెంటనే దీని పై ఆక్షన్ తీసుకోకపోతే, ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ప్రధానికి ఫిర్యాదు చేసారు. నిజానికి మెడ్ టెక్ జోన్ అద్భుతంగా పని చేస్తుందని, నెల క్రిందట గడ్కరీ కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అయితే, జగన్ ప్రభుత్వం మాత్రం, ఈ మెడ్ టెక్ జోన్ ను మయసభ అంటూ, చంద్రబాబుకి అవినీతిని అంటగట్టె ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రధాని మోడీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read