గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదం ఘటన జరిగి అయుదు రోజులు అవుతున్నా, ఇంకా మృతదేహాలు తియ్యలేక పోతుంది, మన అధికార యంత్రాంగం. అయితే ఈ బోటు ప్రమాదం పై, ప్రభుత్వం పై పలు విమర్శలు వస్తున్న వేళ, మాజీ మంత్రి హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ ఘటన పై ప్రభుత్వం కావాలనే తప్పుడు ప్రకటనలు ఇస్తుందని అన్నారు. బోటు ప్రమాద బాధితులను తక్కువ చేసి చూపిస్తున్నారని అన్నారు. నిన్న ఒక్క రోజే మరో అయిదు కుటుంబాలు, తమ వారి జాడ కనిపించటం లేదని ఇక్కడకు వచ్చారని, అంటే మరో అయుదుగురు ఉన్నారు కదా, ఆ విషయం ఎందుకు ప్రభుత్వం చెప్పటం లేదని అన్నారు. తన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం, బోటులో మొత్తం 93 మంది ప్రయాణికులు ఉన్నారని, హర్ష కుమార్ సంచలన ఆరోపణలు చేసారు. ప్రభుత్వం మాత్రం 73 మంది మాత్రమే ఉన్నారని చెప్తుందని అన్నారు.

harsha 19092019 2

కావాలని మృతుల సంఖ్యను తక్కువగా చూపించి, ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వానికి మునిగిపోయిన బోటు జాడ సోమవారం మధ్యాహ్నానికే తెలిసిందని, అయితే బోటు లోపల ఏసి రూమ్స్ లో లెక్కకు మించి మృతదేహాలు బయటపడతాయనే భయంతో ప్రభుత్వం బోటును వెలికి తీయడం లేదని ఘాటు విమర్శలు చేసారు. సంచలనం కోసమో, లేకపోతే మీడియాలో పేరు సంపాదించడం కోసమో తాను ఈ విషయాలను వెల్లడించడం లేదని, ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాల బాధ, ఇన్ని రోజులు అయినా శవాలు దొరక్క ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబాల బాధ చూసి స్పందిస్తున్నానని హర్ష కుమార్ అన్నారు. అంతే కాకుండా, ఈ బోటుల మాటున, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని హర్షకుమార్ ఆరోపించారు.

harsha 19092019 3

ఈ బోటుల వెనుక, ఫారెస్ట్, టూరిజం, ఇరిగేషన్ అధికారుల పెట్టుబడులు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ అధికారులే వ్యాపారం చేస్తున్నారని, అందుకే అసలు వాస్తవాలు వెలుగులోకి రావడం వారికి ఇష్టం లేదని మండిపడ్డారు. ఈ బోటు ప్రమాదం విషయానికి వస్తే, ఎక్కువ మందితో ప్రయాణిస్తున్న బోటుకు దేవీపట్నం ఎస్సై ముందుగా అనుమతి ఇవ్వలేదని, అయితే అప్పుడు టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేసి బోటుకు పర్మిషన్ ఇప్పించేలా చేశారని ఆరోపించారు. అయితే తనపై హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆ రోజున బోటు అనుమతి కోసం ఏ అధికారినీ తాను ఒత్తిడి చేయలేదని, అది పచ్చి అబద్ధం అని, తన పై లేనిపోని ఆరోపణలు చేసిన హర్షకుమార్ పై పరువునష్టం దావా వేస్తానని అవంతి హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read