బీజేపీ స్టైల్ అఫ్ ఫంక్షనింగ్ చాలా వేరుగా ఉంటుంది. మనతో మంచిగా ఉన్నట్టే ఉంటారు, వెనకాల నుంచి చేసేది చేస్తూనే ఉంటారు. చివరకు వాళ్ళు ఏమి చేసారో, పూర్తిగా దిగితే కాని అర్ధం కాదు. ఇదే ఫార్ములా చంద్రబాబు పై ఉపయోగించారు. దాదపుగా మూడేళ్ళ పాటు చంద్రబాబుతో మంచిగా ఉన్నట్టు చేస్తూ, జగన్ తో కలిసి రాజకీయ గేమ్ ఆడారు. చంద్రబాబు తప్పు తెలుసుకునే సారికి చాలా సమయం అయిపొయింది. అప్పుడు మిత్రుడు అయిన చంద్రబాబు, గట్టిగా అడగటం మొదలు పెట్టగానే శత్రువు అయిపోయాడు. ఇక అందరితో కలిసి, చంద్రబాబుని దించే వరకు బీజేపీ నిద్రపోలేదు. ఇప్పుడు జగన్ ది అదే పరిస్థితి. మంచిగా ఉన్నట్టే కనిపిస్తున్నారు కాని, బీజేపీ వల్ల, రాష్ట్రానికి ఇప్పటి వరకు ఒక్క విభజన హామీ కూడా నెరవేరలేదు. మెడలు వంచుతా అన్న జగన్, ప్లీజ్ సార్ ప్లీజ్ అంటున్నారు.

shah 07092019 2

మరో పక్క పోలవరం టెండర్లు విషయంలో కాని, విద్యుత్ ఒప్పందాల రద్దు విషయంలో కాని, ఇలా ఏ విషయంలో కూడా జగన్ కు సహకరించటం లేదు. పైకి మాత్రం, హలో విజయ్ గారు, అంటూ ప్రధాని మోడీ కూడా, సఖ్యతగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. మరి బీజేపీ గేమ్ ఆడుతుందో, లేక జగన్, విజయసాయి రాష్ట్రం విషయంలో కాంప్రోమైజ్ అవుతున్నారో కాని, కేంద్రం మాత్రం జగన్ కు షాకులు మీద షాకులు ఇస్తూనే ఉంది. మొన్నటి మొన్న ఇంటలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్రను నియమించాలి, తెలంగాణా నుంచి డిప్యూటేషన్ పై పంపించండి అంటే, కేంద్రం తిరస్కరించింది. ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో కూడా జగన్ ప్రభుత్వానికి సహకారం ఇవ్వటం లేదు. అటు కేసీఆర్ తెలంగాణా నుంచి పంపించటానికి ఒప్పుకున్నా కేంద్రం మాత్రం, నిబంధనలు చూపించి నో అంది.

shah 07092019 3

ఇప్పుడు తెలంగాణకే చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి డిప్యుటేషన్‌కు కూడా కేంద్రం అంగీకరించే అవకాశం కనిపించటం లేదు. స్టీఫెన్ రవీంద్ర విషయంలో ఉన్న ‘సూపర్‌ టైమ్‌’ స్కేల్‌ నిబంధనే ఇక్కడ కూడా కారణమని చెబుతున్నారు. సూపర్‌ టైమ్‌స్కేల్‌ అధికారులను ఇతర రాష్ట్రాలకు డిప్యుటేషన్‌ పై పంపించాలి అంటే ఎంతో అసాధారణ పరిస్థితి ఉండాలి. శ్రీలక్ష్మి, స్టీఫెన్‌ రవీంద్రల విషయంలో అలాంటి అసాధారణ పరిస్థితు లు లేవని కేంద్రం భావిస్తుంది. అయితే వీరిని ఆంధ్రప్రదేశ్ తీసుకురావటానికి, స్వయంగా జగన్ రంగంలోకి దిగారు. శ్రీలక్ష్మిని ఢిల్లీ తీసుకు వెళ్లి మరీ, హోం మంత్రి అమిత్ షా ని కలిసి లాబీయింగ్ చేసారు. అలాగే విజయసాయి రెడ్డి కూడా చెయ్యని ప్రయత్నం లేదు. ఇన్ని చేసినా, కూడా కేంద్రం కనీసం సహకరించటం లేదు. స్టీఫెన్ కు ఇప్పటికే నో చెప్పారు. రేపో మాపో శ్రీలక్ష్మి విషయంలో కూడా నో చెప్పనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read