ఆంధ్రుల రాజధాని అమరావతి పై జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి బొత్సా సత్యన్నారాయణ ప్రకటనలు కొనసాగుతున్నాయి. మొన్నటిదాకా అమరావతిలో వరదలు వస్తాయి, అమరావతి పై ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటూ గందరగోళ ప్రకటనలు చేసిన బొత్సా, ఇప్పుడు మళ్ళీ మరొక ప్రకటన చేసారు. చంద్రబాబు హయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చంద్రబాబు గజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటూ బొత్సా ప్రశ్నించారు. గజిట్ ఇవ్వకుండా చంద్రబాబు కావాలని చేసారని, చంద్రబాబుకి అమరావతి మార్చే ఆలోచన ఉండబట్టే, గజిట్ ఇవ్వలేదని బొత్సా అన్నారు. అయితే, ఇక్కడ బొత్సా వ్యాఖ్యల పై కౌంటర్ లు గట్టిగా పడుతున్నాయి. సీనియర్ మంత్రిగా ఉన్న బొత్సాకు ఆమాత్రం కూడా తెలియదా, లేక అధికారులు కూడా కనీసం చెప్పరా, బొత్సా వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్సనంగా నిలుస్తున్నాయి.
ఏపి రీ ఆర్గనైజేషన్ బిల్లు ప్రకారం రాష్ట్ర విభజన అయిన తేదీ నుండి పది సంవత్సరాల వరకు హైదరాబాద్ తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు ఉమ్మడి రాజధానిగా ఉన్నది అనేది అందరికీ తెలిసిందే. విభజన చట్టంలో ఉన్న రాజధానిని కాదని అమరావతిని నియమిత కాలానికి ముందే గజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటిస్తే ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును ఆంధ్రప్రదేశ్ కోల్పోవలసి వస్తుంది. మనం హైదరాబాద్ నుంచి పరిపాలన చెయ్యకపోయినా, కొన్ని వెసులుబాటులు ఉంటాయి. విభజన చట్టంలో పేర్కొన్న ఆస్తుల విభజన జరగకుండా హైదరాబాదును రాజధానిగా వదులుకోవటం రాష్ట్రానికి మంచిదికాదు. అందువల్లనే అనధికారికంగా అమరావతిని రాజధానిగా ప్రకటించి ప్రధానమంత్రితో శంకుస్థాపన చేయించారు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
బొత్స సత్యనారాయణ అనుభవజ్ఞుడైన రాజకీయనాయకుడిగా, మంత్రిగా కూడా వుండి బాధ్యతారాహిత్యంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని గజిట్ నోటిఫికేషన్ ఎందుకు చెయ్యలేదని చంద్రబాబుని ప్రశ్నించడం హాస్యాస్పదం. భారత ప్ర భుత్వం లో ప్రతి రాష్ట్రం కి అధికారిక రాజధాని పెరు ఒకటి ఉంటది. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు ఆ పేరుతో నే జరుగుతాయి. అమరావతి ని రాజధానిగా ప్రకటించి దానికి అధికారిక ముద్ర ఇస్తే ఇప్పుడు ఉమ్మడి రాజధాని గా ఉన్న హైద్రాబాద్ రాజధాని గా ఉండటం కుదరదు. అందుకని అమరావతి ని తాత్కాలిక రాజధాని గా ప్రకటిస్తూ భారత ప్రభుత్వం కి తెలియచేశారు. నాటి నుండి భారత ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు అన్ని అమరావతి పెరు తో నడుస్తున్నాయి. సచివాలయం పెరు లో కూడా ఇంటరీమ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అని అన్నారు. తాత్కాలిక రాజధాని అన్ని తాత్కాలికమే అని వైసీపీ విమర్శలు చేస్తుంటే నాటి టీడీపీ ప్రభుత్వం వారికి ప్రజలకు సరిగా వివరించలేకపోయింది. ఇప్పుడు అధికారికం గా వైసీపీ అదే విమర్శ చేస్తుంటే ఇప్పుడు సరిగా చెప్పలేక పోతున్నారు.