జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఆగిపోయాయి. అమరావతి అసలు ఉంటుందా, ఉండదా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మంత్రులు చేస్తున్న ప్రకటనలు కూడా తీవ్ర గందరగోళ పరిస్థతితులకు తావు ఇచ్చింది. ఇంత జరుగుతున్నా, జగన్ మోహన్ రెడ్డి మాత్రం, అమరావతి పై ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. దీంతో అమరావతి ఉంటుందా ఉండదా అనే కన్ఫ్యూషన్ ప్రజల్లో ఉంది. ఒక పక్క ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అమరావతికి రుణం ఇవ్వం అంటూ తేల్చి చెప్పాయి. జగన్ మోహన్ రెడ్డి, కేంద్రం దగ్గరకు వెళ్లి, అమరావతికి ప్రస్తుతానికి ఎలాంటి సహాయం అవసరం లేదని చెప్పారు. అయితే అమరావతి పై పెట్టుబడులు పెట్టె వారు కూడా కన్ఫ్యూషన్ లో ఉన్నారు.
ముఖ్యంగా అమరావతిలోని స్టార్ట్ అప్ ఏరియాలో పెట్టుబడులు పెట్టాటానికి రెడీ అయిన సింగపూర్ ప్రభుత్వం, కూడా కన్ఫ్యూషన్ లో పడింది. పోయిన వారం సింగపూర్ మంత్రి శ్రీధరన్ ఈ విషయం పై, సింగపూర్ పార్లమెంట్ లో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అమరావతిలో అధికార మార్పిడి జరిగింది అని, ప్రస్తుత ప్రభుత్వ వైఖరి పై గమనిస్తున్నాం అని అన్నారు. అలాగే, ప్రభుత్వ బ్యాంక్ కూడా అమరావతికి రుణం ఇవ్వకుండా వెనక్కు వెళ్లిందని, ఈ పరిణామాలు అన్నీ గమనిస్తున్నాం అని అన్నారు. అయితే ఈ రోజు మరో సింగపూర్ మంత్రి వీవీయన్ బాలకృష్ణన్ కూడా అమరావతి పై స్పందించారు. వీవీయన్ బాలకృష్ణన్ సింగపూర్ ప్రభుత్వానికి విదేశాంగ మంత్రి. ఆయన కూడా ఈ రోజు సింగపూర్ లో జరిగిన ఒక సదస్సులో, అమరావతి పై మాట్లాడారు.
సింగపూర్ ప్రభుత్వం అమరావతిలో పెట్టుబడులు పెట్టాలి అనుకుందని, అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సింగపూర్ ప్రభుత్వం గమనిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టును సమీక్షించాలని భావిస్తోందని సింగపూర్ కన్సార్షియం తమకు తెలిపిందని సింగపూర్ మంత్రి వెల్లడించారు. కొత్త ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం కోసం తాము వేచి చూస్తున్నామన్నారు. సమీక్ష ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని ఆయన చెప్పారు. ఎలాగూ జగన్ మోహన్ రెడ్డికి అమరావతి పై ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, సింగపూర్ ప్రభుత్వం, ఇక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టే అనుకోవాలి. చూద్దాం, జగన్ మోహన్ రెడ్డి గారి మనసు ఏమైనా మారుతుంది ఏమో.