ప్రస్తుతం దేశం అంతా, ట్రాఫిక్ చాలాన్ల గోల నడుస్తుంది. అధిక ఫైన్ ల రూపంలో, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల పై, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక విధంగా ఈ ఫైన్లు మంచిదే అయినా, ముందు మంచి రోడ్లు వేసి, తరువాత ఫైన్లు తీసుకోండి అనే వారు కూడా ఉన్నారు. నిన్న ఢిల్లీలో, ఒక టు వీలర్ కు, ఫైన్ల రూపంలో 47 వేలు రూపాయలు ఫైన్ వెయ్యటంతో, బండి రేటు కూడా అంత లేదు అంటూ, విరక్తి చెందిన ఆ వ్యక్తి, పోలీసుల ముందే బండి పై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. గత నాలుగు రోజులుగా ఇలాంటి సంఘటనలో ఎన్నో, ఈ దేశంలో జరుగుతున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నా, కొంత మంది మాత్రం వీటిని సమర్ధిస్తున్నారు. అయితే ఈ కొత్త ఫైన్ల విధానం ఇంకా మన తెలుగు రాష్ట్రాలకు రాలేదు. త్వరలోనే మన రాష్ట్రాల్లో కూడా ఈ కొత్త ఫైన్ లు రానున్నాయి. అయితే ఈ తరుణంలో, మన రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఆటో నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదు అంటూ, వచ్చిన చలాన్ చూసి ఆ ఆటో డ్రైవర్ అవాకయ్యాడు. కొంచెం సేపు విషయం ఏంటో అర్ధం కాక, తల బాదుకున్నాడు. చివరకు విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళాడు. ఎక్కడైనా చక్ర వాహనం నడిపే వ్యక్తి హెల్మెట్ లేకపోతే జరిమానా వేస్తారు కాని, ఆటో డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదు అని చెప్పి జరిమానా వెయ్యటం, మన రాష్ట్రంలో ఇప్పుడే వింటున్నాయి. ఆటో డ్రైవర్ కి హెల్మెట్ లేకపోవటంతో, జరిమానా విధించారు అని తెలియటంతో, అందరూ అవాక్కయ్యారు. ఈ ఘటన విజయవాడలో జరిగింది. విజయవాడ పోలీసులు నిర్వాకం బయట పడటంతో, ఈ విషయం వైరల్ అయ్యింది.
విజయవాడలోని మూడో పట్టణ ట్రాఫిక్ పోలీసులు ఒక ఆటోడ్రైవరుకు హెల్మెట్ లేదు అంటూ, ఈ-చలానా పంపించి అందర్నీ ఔరా అనిపించారు. ఏపీ16టిఎస్8597, నంబరు గల ఆటో పై ఐదు ఈ-చలానాలు ఉన్నాయి. ఆటో యజమాని ఈనెల 3న ఏపీ ఆన్‌లైన్‌లో ఆ అపరాధ రుసుమును కట్టటానికి అని వెళ్ళాడు. అయితే వాటిలో ఒక చలానా రూ.135 హెల్మెట్ ధరించని కారణంగా వేశామంటూ పేర్కొనడంతో అది చూసి ఆశ్చర్యపోయారు. ఆటో నడుపుకునే నాకు, ఆటో నెంబర్ పై, హెల్మెట్ లేకపోవటం ఏంటి అంటూ ఆశ్చర్య పోయాడు. ఈ క్రమంలో విజయవాడ మూడో పట్టణ ట్రాఫిక్ పోలీసుల నిర్వాకం బయటపడింది. అయితే ఈ విషయం పై స్పందించిన అధికారులు, అప్పుడప్పుడు ఇలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయని, ఒకటి పెట్టబోయి, ఇంకోటి పెట్టి ఉంటారని, ఇలాంటివి మా ద్రుష్టికి రాగానే సరి చేస్తామని అన్నారు.