గోరంతను కొండత చేసి చూపించి, చివరకు సెల్ఫ్ గోల్ వేసుకోవటం రాజకీయ నాయకుల స్టైల్. ఇందులో వైసీపీ రెండు ఆకులు ఎక్కువే చదివింది. ఇలా అతి ప్రచారం చేసి, చివరకు వారి మెడకే చుట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఇలాగే ఫేస్బుక్ లో అతి ప్రచారం చేసి, తమ ప్రభుత్వానికి, తమ అధినేత జగన్ కు మంచి పేరు తీసుకువద్దాం అనుకుని, ఆయన బుక్ అయ్యింది కాక, తన ప్రభుత్వాన్ని, తమ అధినేత జగన్ ను కూడా బుక్ చేసి, అభాసుపాలు అయ్యారు. ఆ ఎమ్మెల్యే శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ఎన్నికైన సీదిరి అప్పలరాజు. ఎంతో కష్టపడి, నిజాయతికి మారు పేరు అయిన సర్దార్ గౌతు లచ్చన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన మనవరాలు శిరీష పై గెలుపొందారు. అయితే అంతటి గొప్ప ఘన విజయం సాధించిన అప్పలరాజు, మరీ అతి ప్రచారం చేసి, ఇప్పుడు ఇబ్బందులు పాలు అయ్యారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన, గ్రామ వాలంటీర్ వ్యవస్థ, అలాగే నాణ్యమైన బియ్యం పధకాల పై, ప్రజలకు ప్రచారం చేయాలనీ, ఇది ఎంతో గొప్ప వ్యవస్థ, బియ్యం ఎంతో బాగున్నాయి అని చెప్దాం అనుకుని బుక్ అయిపోయారు. ఒక రేషన్ బియ్యం బస్తా ముందు పెట్టి, తన ఫ్యామిలీ మొత్తాన్ని ఉంచి, ఒక మాంచి ఫోటో ఒకటి దిగి, అది సోషల్ మీడియాలో పెట్టారు. చూసారా, ఈ వ్యవస్థ ఎంత గొప్పగా పని చేస్తుందో అని చెప్పాలని, ఆయన ఉద్దేశం. అయితే ఆ ఫోటో సాక్షిగా వచ్చే ముప్పుని, విమర్శలని గుర్తించలేక పోయారు. ఆ ఫోటో పెట్టగానే, నెటిజెన్ లు ప్రశ్నలు మీద ప్రశ్నలు అడగటం మొదలు పెట్టారు. అసలు మీకు తెల్ల రేషన్ కార్డు ఎలా వచ్చింది ? మీరు డాక్టర్ కదా, మీరు తెల్ల రేషన్ కార్డు, కోటా బియ్యం తీసుకునేంత పేద వారా ?
ఒకవేళ ప్రభుత్వం పొరపాటున ఇచ్చినా, ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఎందుకు తీసుకున్నారు ? ఇలా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసారు. ఇదేనా మీ ప్రభుత్వం విధానం ? పేదలకు ఇవ్వకుండా, మీలాంటి వారికి రేషన్ బియ్యం అవసరమా అంటూ సామాన్య ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఈ విమర్శల పై అప్పల రాజు స్పందిస్తూ, రేషన్ కార్డు తాను తీసుకోలేదని, తనకు అవసరం అయ్యి 2009లో తెల్ల కార్డ్ తీసుకున్నా అని, ఈ కార్డు ఎప్పుడో 2014లోనే రద్దు అయిపోయిందని, మళ్ళీ ఈ నెల ఎందుకు యాక్టివ్ అయ్యిందో తెలియదని, ఇప్పుడు వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చెయ్యమని కోరతా అని కవరింగ్ ఇచ్చుకోచ్చారు. అయితే ప్రజలు మాత్రం, ఇదంతా ఒక కట్టు కధ అని, ఒక స్క్రిప్ట్ రాసి, జగన్ ప్రభుత్వాన్ని గొప్పగా చెప్దాం అనుకుని, ఇలా బుక్ అయ్యారని అంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ప్రశంసలు ప్రజల నుంచి రావాలి కాని, ఇలా ఎమ్మెల్యేలు, సొంత స్క్రిప్ట్ తో డబ్బా కొడితే, జగన్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందా ?