మొన్నటి దాకా తెలంగాణా ఎన్నికల్లో హడావిడి చేసిన, నటుడు, నిర్మాత బండ్ల గణేష్, మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. తెలంగాణా ఎన్నికల సమయంలో, హడావిడి హడావిడి చేసి, చివర్లో బ్లేడ్ తో గొంతు కోసుకుంటా అని చెప్పి, ఫలితాలు రాగానే కనుమరుగు అయిపోయారు. అయితే ఇప్పుడు మళ్ళీ దాదపుగా 9 నెలలు తరువత మళ్ళీ రాజకీయాలు గురించి మాట్లాడుతూ, వార్తల్లోకి వచ్చారు. అయితే ఈ సారి తెలంగాణా గురించి కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై స్పందించారు. అటు జగన్ మోహన్ రెడ్డి పరిపాలనను విమర్శలు చేస్తూనే, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు పై సుతి మెత్తగా కౌంటర్లు ఇచ్చారు. అయితే ఇప్పుడు సడన్ గా బండ్ల గణేష్ మళ్ళీ ఎందుకు హడావిడి చేస్తున్నారు ? పది నెలలు తరువాత, ఇప్పుడు తెలంగాణా రాజకీయాలు వదిలి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎందుకు వేలు పెట్టారు అనేది చూడాలి.

bandla 11092019 2

బండ్ల గణేష్ మాట్లాడుతూ, ముఖ్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన చలో ఆత్మకూరు విషయం పై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లోని, పల్నాడులో జరుగుతున్న గొడవలతో, ఆంధ్రప్రదేశ్ పరువు గంగలో కలిసిపోయిందని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పనులు చూస్తుంటే, ఆంధ్రా మరో బీహార్‌లా తయారైందనే భావన అందరికీ కలుగుతుందని, బండ్ల గణేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పై మాట్లాడుతూ, పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణాలను ఆపేసారని, ఎందుకు ఎలా చేసారో అని విమర్శించారు. రాజధానిగా అమరావతి ఉంటుందో ఊడుతుందో తెలియక ప్రజలు జుట్టు పీక్కుంటున్నారని బండ్ల గణేష్, జగన్ ప్రభుత్వ వైఖరి పై మండిపడ్డారు.

bandla 11092019 3

వైసీపీ పాలనపైనా ఘాటు విమర్శలు చేస్తూ, వంద రోజుల పాలనలో ఏమీ చేయని జగన్ మోహన్ రెడ్డి నిద్రలేవాలి అని బండ్ల గణేష్ అన్నారు. చంద్రబాబు కూడా, జగన్ కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని అన్నారు. మరో పక్క, జెండా, ఎజెండా లేని నాయకులు కొంతకాలం రెస్ట్ తీసుకుంటే మంచిదని బండ్ల గణేష్ అన్నారు. జనాన్ని కాసేపు మనశాంతిగా ఉండనివ్వండి అంటూ రాజకీయ పార్టీలను విన్నవించారు. ‘‘దగాపడ్డ తెలుగు ప్రజలారా! ఏ నాయకుడినీ నమ్మొద్దు, మీకు సాయం చేసే స్థితిలో నేను లేను, మనందరినీ ఆ భగవంతుడే కాపాడాలని. భావితరాలకు ఆయనే (భగవంతుడే) దిక్కు’’ అని బండ్ల వ్యాఖ్యానించారు. అయితే జగన్, చంద్రబాబు పై డైరెక్ట్ గా విమర్శలు చేసిన బండ్ల, జెండా, అజెండాలేని నాయకులూ రెస్ట్ తీసుకోవాలని, ఎవరిని ఉద్దేశించి అన్నారో, అన్న చర్చ రాజకీయ విశ్లేషకుల మధ్య జరుగుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read