ఇసుక కొరత వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందుల పై, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ పిలుపు ఇచ్చింది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల, టిడిపి ఎమ్మెల్యేలు, నేతలు బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేసారు. కొంత మంది నేతలను అదుపులోకి కూడా తీసుకున్నారు పోలీసులు. కేవలం ప్రజల తరుపున ధర్నా చేయ్యనివ్వటానికి కూడా ప్రభుత్వం ఓర్చుకోలేక పోతుందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా చిన్న ధర్నాలకే అరెస్ట్ చేస్తే, రేపు పెద్ద పెద్ద ఆందోళనలు చేస్తే, కాల్పులకు కూడా ఈ ప్రభుత్వం వెనుకాడేలా లేదని తెలుగుదేశం నేతలు అంటున్నారు. టిడిపి చేస్తున్న ఆందోళనలో భవన నిర్మాణ కూలీలు, ఇతర పనులు చేసే వాళ్ళు కలిసి పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. ఇసుక లేకపోవటం వల్ల ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా, జగన్ పట్టించుకోవడం లేదని తెలుగుదేశం నేతలు విమర్శించారు.

sand 30082019 2

మరో పక్క, మాజీ మంత్రి దేవినేని ఉమా, గొల్లపూడిలోని ఆయన నివాసం నుంచి, ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు వెళ్తుండగా పోలీసులు దేవినేని ఉమాని పోలీసులు అడ్డుకుని హౌస్‌ అరెస్టు చేశారు. ఈ ప్రదేశంలో ధర్నాలకు అనుమతి లేదని అందుకే హౌస్ అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు ఉమాకి నోటీసులు జారీ చేశారు. శాంతియుతంగా ధర్నా చేసి, పేద ప్రజల తరుపున పోరాడి వస్తాం అన్నా కూడా, హౌస్‌ అరెస్టు చేయడం దారుణమని, పోలీసులను అడ్డంపెట్టుకుని జగన్‌ ఇలాంటి కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఉమా విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది టీడీపీ నేతలను హౌస్‌ అరెస్టు చేశారని, మేము ఏమి మీ పై దాడికి రావటం లేదని, కూలీల తరుపున పోరాడటానికి వస్తుంటే, మీకు అంత అసహనం అయితే ఎలా అని ప్రశ్నించారు.

sand 30082019 3

ఇక పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. అయితే ఆయనను హౌస్ అరెస్ట్ అని చెప్పి, అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. చించినాడ మీదుగా తూర్పుగోదావరి తరలించారు. దీంతో కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. ఎమ్మెల్యే నిమ్మల స్వచ్ఛందంగా తాను వస్తానని చెబుతున్నప్పటికీ పోలీసులు దౌర్జన్యంగా లాక్కెళ్లారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇక పోలీసులు ఏలూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ని గృహ నిర్బంధం చేశారు. అలాగే కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడిని హౌస్ అరెస్టు చేశారు. ఇలా అన్ని చోట్లా, తెలుగుదేశం నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి, ఇబ్బందులు పెడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read