బీజేపీ పార్టీ అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరు వెయ్యటానికి పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా, మొన్నటి ఎన్నికల్లో ఒక వ్యూహం ప్రకారం చంద్రబాబుని దించి, జగన్ ను ఎక్కించటంలో సక్సెస్ అయ్యారు. డైరెక్ట్ గా కాకుండా, రహస్య మిత్రులుగా బీజేపీ, వైసిపీ వ్యవహరించాయి. చంద్రబాబు నుంచి అధికారం లాక్కోవటం కష్టం కాబట్టి, జగన్ నుంచి అధికారం లాక్కోవటం చాలా తేలికగా బీజేపీ భావిస్తుంది. అందుకే పోయిన ఎన్నికల్లో ఆ వ్యూహాన్ని అమలు చేసారు. అయితే ఇప్పుడు జగన అధికారంలోకి వచ్చిన వెంటనే, బీజేపీ హిందుత్వ గేమ్ ఆడటం మొదలు పెట్టింది. తిరుమల విషయంలో, శ్రీశైలం విషయంలో, అలాగే జగన్ ను కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, చాప కింద నీరులా నెమ్మదిగా విస్తరిస్తూ వస్తుంది. జగన్ ను ఇలా దెబ్బ తీస్తూనే, అటు టిడిపిని కూడా టార్గెట్ చేసింది.
టిడిపి ఇంత ఘోరంగా ఓటమి చెందినా, జగన్ చేసే తప్పులతో, మళ్ళీ ప్రజలు చంద్రబాబు వైపు చూస్తారు కాబట్టి, రాజకీయంగా తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టే ప్రయత్నంలో భాగంగా, టిడిపి నేతలను తమ వైపు తిప్పుకునే ప్లాన్ వేసింది. ఇప్పటికే రాజ్యసభ సభ్యులను తమ వైపు తిప్పుకుంది. కొంత మంది ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలోకి వస్తున్నారు అంటూ ప్రచారం చేస్తుంది. ఈ నేపధ్యంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు, తెలంగాణాలో సమావేశం అయ్యారు. గచ్చిబౌలిలోని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో బీజేపీ నేతల రహస్య సమావేశం జరుగుతోంది. అయితే ఈ భేటీ ఆంధ్రప్రదేశ్ లో కాకుండా, తెలంగాణాలో ఏర్పాటు చెయ్యటం పై, సర్వత్రా చర్చ జరుగుతుంది. తెలంగాణాలో అయితే, ఏపి ఇంటలిజెన్స్ బాధ ఉండదు అని ఏమో కాని, అక్కడ సమావేశం అయ్యారు.
ఈ సమావేశానికి ఏపీ బీజేపీ నేతలు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, పురంధేశ్వరి, మాణిక్యాలరావు, సోము వీర్రాజు, సత్యమూర్తి హాజరయ్యారు. కాసేపట్లో సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని మరింత బల పరిచేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే తెలంగాణాకు చెందిన టీడీపీ అగ్రశేణి నాయకులు బీజేపీలో చేరారు. నేతల చేరికతో ఏపీలో ఆ పార్టీ ఉత్సహంగా ఉంది. అయితే ఏపీ నేతలు తెలంగాణలో రహస్యంగా సమావేశం కావడం చర్చనీయాంశమైంది. అయితే వీరి సమావేశానికి కేంద్ర మంత్రిగా ఉంటున్న కిషన్‌రెడ్డి హాజరుకావడం గమనార్హం. ఈ సమావేశం జగన్ ను టార్గెట్ చేసుకుని అయి ఉంటుందని, అందుకే సేఫ్ గా తెలంగాణాలో పెట్టుకున్నారని, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.