కృష్ణా నదికి వచ్చిన వరదలు, ప్రకాశం బ్యారేజీకి కొత్త కష్టాలు తెచ్చి పెట్టాయి. వరద ఆగిపోయి దాదపుగా వారం పైన అయ్యింది. ప్రకాశం బ్యారేజీ మూసేసారు. పైన ఉన్న పులిచింతల మూసేసారు. కాని ప్రకాశం బ్యారేజీ నుంచి మాత్రం, నీళ్ళు కిందకు వస్తూనే ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీ మూసేసినా, ఎలా వస్తున్నాయి అనుకుంటున్నారా ? 70 గేటుల్లో, ఒక గేటు మాత్రం మూతబడలేదు. అందుకే ప్రకాశం బ్యారేజీలో ఉండాల్సిన నీళ్ళు, బయటకు వస్తున్నాయి. అయితే ఈ విషయం గమించిన ఇరిగేషన్ అధికారులు ఎంత ప్రయత్నించినా, ఆ బోటుని అక్కడ నుంచి తెయ్యలేక పోయారు. తరువాత రోజు కలెక్టర్ వచ్చి సమీక్ష జరిపి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయినా పడవ బయటకు రాలేదు. ఇదే విషయం ప్రభుత్వ పెద్దలకు చెప్పారు. మొదట్లో ప్రభుత్వ పెద్దలు కూడా పెద్దగా పట్టించుకోలేదు.

boat 25082019 2

కాని రోజు రోజుకీ నీళ్ళు వేస్ట్ అవుతూ ఉండటం, దాదపుగా వారం రోజుల నుంచి ఆ గేటు ముసుకోలేదు అని ప్రజల్లో ఒక భావన ఏర్పడటంతో, ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రంగంలోకి దిగారు. నిన్న రోజంతా అక్కడ ఉండి అధికారుల చేత, బోటు తీసే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలో అక్కడ నీటి ప్రవహం తగ్గించటానికి, అక్కడ మరికొన్ని గేట్లు ఎత్తి నీళ్ళు కిందకు వదిలారు. హెచ్చరికలు లేకుండా నీళ్ళు వదలటంతో, కింద ఉన్న ప్రజలు అప్రమత్తం అయ్యి, పరిగెత్తారు. కాని ఒక ముసలాయన మాత్రం, నీతి ప్రవాహంలో చనిపోయారు. బోటు తియ్యమంటే, ప్రాణం తీస్తారా అంటూ తెలుగుదేశం కూడా ఫైర్ అయ్యింది. అయితే, నిన్నంతా ఎంత ప్రయత్నం చేసినా, బోటు మాత్రం రాలేదు.

boat 25082019 3

దీంతో ఈ రోజు కూడా ప్రయత్నాలు జరిగాయి. దీనికోసం కాకినాడ, బళ్లారి, పులిచింతల, బైరవానితిప్ప నిపుణుల బృందాలు ఇందులో పాల్గొన్నాయి. పడవకు రంద్రాలు చేసి ఇనుపతాడు సాయంతో, బోటుని ఎట్టకేలకు బయటకు లాగారు. అయితే ఆ బోటు చూసిన ప్రజలు మాత్రం, ఆశ్చర్యపోయారు. అది ఎదో చిన్న బోటు కాదు, ఇసుక తరలించే బోటు. దాదపుగా 30 లారీల వరకు లోడ్ చెయ్యగలదు. ఇంత పెద్ద బోటు అడ్డం పడినా, ప్రకాశం బ్యారేజీకి ఎక్కడా డ్యామేజ్ కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ, మాత్రం అనుమనాలు వ్యక్తం చేస్తుంది. ఇసుక తవ్వకాలు ఆగిపోయి, నాలుగు నెలలు అవుతుంది. ఈ బోటు నదిలో ఎందుకు ఉంది ? ప్రవాహం ఆపి, నీళ్ళు వెనక్కు తన్నటానికి ప్రభుత్వం కుట్ర పన్నిందా అని లోకేష్ కూడా ఆరోపించారు. అయితే వైసీపీ మాత్రం చిన్న బోటు, ప్రవాహం ఆపుతుందా అని హేళన చేసింది. అయితే, వారం రోజుల నుంచి ఆ బోటు తియ్యటానికి ప్రభుత్వం పడుతున్న కష్టాలు, ఈ రోజు బోటు బయటకు తీసిన తరువాత, అది ఇంత పెద్దదా అని ప్రజలు ఆశ్చర్యపోతూ, ఆ రోజు టిడిపి చెప్పిన కుట్ర కోణం నిజమేనేమో అని అనుకునే వారు కూడా ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read