తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసే విషయంలో, ప్రత్యర్ధి పార్టీ వాళ్ళే కాదు, సొంత పార్టీ వాళ్ళు కూడా అప్పుడప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు. చంద్రబాబుకి ఉన్న తలనొప్పులకు ఇది ఓక ఎక్ష్త్రా అడ్వాంటేజ్. తెలుగుదేశం పార్టీలో నందమూరి కుటుంబ సభ్యుల పాత్ర ఎంతో ముఖ్యం. ఆనాడు ఎన్టీఆర్ అయినా, తరువాత బాలకృష్ణా, హరికృష్ణా, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాం, తారక్ రాం, ఇలా ఎవరికి తోచినట్టు వారు పార్టీకి సేవ చేసారు. బాలకృష్ణ 2014 నుంచి ఫుల్ టైం రాజకీయాల్లో ఉన్నారు. హరికృష్ణ కొన్నాళ్ళు ఉన్నా, తరువాత సైలెంట్ అయిపోయారు. చంద్రబాబు 2009లో హరికృష్ణకు రాజ్యసభ టికెట్ కూడా ఇచ్చారు. అయితే విభజన సమయంలో, ఆయన రాజీనామా చేసారు. ఇక జు ఎన్టీఆర్, మిగతా వారసులు, పార్టీకి కావలసిన సమయంలో వచ్చి ప్రచారం చేసి, వెళ్ళిపోయి, వాళ్ళ సినిమాలు చూసుకుంటూ ఉంటారు. ఇది కరెక్ట్ కూడా, ఎందుకంటే, వాళ్ళకు సినిమాల్లో ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాలి.

bharat 25082019 2

అయితే ఇక్కడ రాజకీయాన్ని, సినిమాని విడదీసి చూడాల్సిన సందర్భంలో, రాజకీయాల్ని, సినిమాలను కలిపి చూసి, పార్టీకి లేని పోని తలనొప్పులు తీసుకు వస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఇది ఎక్కువ అవుతుంది. లోకేష్ అన్ని వ్యాపారాలు వదిలేసి, ఫుల్ టైం రాజకీయాలు చేస్తున్నారు. అదే సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు వదిలి, రాజకీయాల్లోకి వచ్చి, పార్టీకి మంచి చేస్తాను అంటే ఆపే వారు ఎవరు ఉంటారు ? కాని ఇదే సందర్భంలో, ఫుల్ టైం రాజకీయాల్లో ఉన్న లోకేష్ కు, ఫుల్ టైం సినిమాల్లో ఉన్న జు ఎన్టీఆర్ కు లంకె పెడతారు ఎన్టీఆర్ ఫాన్స్. ఇది పార్టీకే దెబ్బ అవుతుంది. ఇప్పుడు బాలయ్య చిన్న అల్లుడు, విశాఖ ఎంపీగా పోటీ చేసిన భరత్ చేసిన వ్యాఖ్యలు కూడా అనవసర రాద్ధాంతానికి దారి తీసాయి. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో, ఇది అనవసర చర్చ అనే చెప్పాలి. నిన్న ఒక ఇంటర్వ్యూ లో భరత్ ని, విలేఖరి అడిగిన ప్రశ్న "జూనియర్ ఎన్టీఆర్ "వస్తేనే" పార్టీ బాగుపడుతుంది అనుకుంటున్నరా ?" అని ప్రశ్న వేసారు.

bharat 25082019 3

దీనికి భరత్ సమాధానం చెప్తూ, అలా ఎందుకు అనుకోవాలి, జూనియర్ వస్తే ఎవరూ కాదనరు, ఆయనకు ఫ్యాన్ ఫలోఇంగ్ ఉంది, బాగా మాట్లడతారు, చంద్రబాబు దగ్గరకు వచ్చి, నేను రాజకీయాల్లోకి వస్తాను అని అడిగితే, చంద్రబాబు ఒకే అంటే ఆయన రావచ్చు. అంతే కాని, అయన వల్ల మాత్రమే పార్టీ నిలబడుతుంది అంటే ఒప్పుకొను, పార్టీలో ఎంతో మంది ఉన్నారు, అందరి సమష్టి కృషితో ముందుకు వెళ్తాం అన్నారు. ఇదే సమయంలో ఆ విలేఖరి మళ్ళీ అడుగుతూ, ఎన్టీఆర్ వస్తేనే పార్టీ నిలబడుతుంది అని మీరు అనుకోవటం లేదు ? అని అడిగితే, అవును ఎన్టీఆర్ వస్తేనే నిలబడుతుంది అని అనుకోవటం లేదు అని స్పష్టంగా చెప్పారు. అయితే ఎన్టీఆర్ ఫాన్స్, ఈ మాటను తప్పుగా అర్ధం చేసుకుంటూ, ఎన్టీఆర్ అవసరం పార్టీకి లేదు అనే యాంగిల్ తీసుకున్నారు. దీని వల్ల పార్టీకే నష్టం కాని, ఎవరికో కాదు. జు ఎన్టీఆర్ సియం అవ్వాలి అంటే, ముందు పార్టీ బలంగా ఉండాలనే లాజిక్ మర్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. జు ఎన్టీఆర్ వస్తాను అంటే, ఆపేది ఎవరు ? చంద్రబాబుకి మరికొంత బలం వస్తుంది. ఇలా ఎవరో అన్నారు అని కాకుండా, జు ఎన్టీఆర్ ఫాన్స్, ఎన్టీఆర్ ఫుల్ టైం రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి తెస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది కాని, ఆయన పాటికి ఆయన అందరివాడు అనిపించుకోవటం కోసం, ప్రశాంతంగా సినిమాలు తీసుకుంటుంటే, అపార్ధాలు చేసుకుని, పార్టీకి మరింత నష్టం చేస్తున్నారు. భరత్ లాంటి వాళ్ళు కూడా, ఇక నుంచి కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే, ఈ అపోహలు కూడా లేకుండా ఉంటాయని టిడిపి అబిమానులు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read