బీజేపీ, వైసిపీ మధ్య గ్యాప్ రోజు రోజుకీ పెరిగిపోతుంది. మొన్నటి దాక, రాష్ట్రంలో ఎలా ఉన్నా, కేంద్రంలో జగన్, విజయసాయి రెడ్డిలకు మంచి పట్టు ఉందని అనుకునే వారు. కాని ఇప్పుడు అది కూడా సడలిపోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న విజయసాయి రెడ్డి చేసినవ వ్యాఖ్యలతో, ఢిల్లీ బీజేపీ నేతలు కూడా తీవ్ర ఆగహ్రంతో ఉన్నారు. తమ చేతకాని తనాన్ని, మోడీ, అమిత్ షా ల పై విజయ్సాయి రెడ్డి నేట్టేయటం ఏంటి అంటూ, ఢిల్లీ వర్గాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. నిన్న విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, విద్యుత్ ఒప్పందాల సమీక్షలు కాని, పోలవరం రీ టెండరింగ్ కాని, అన్నీ ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా లకు చెప్పి చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో జరిగే అన్ని పనులు, మోడీ, అమిత్ షా ఆశీస్సులతోనే జరుగుతున్నాయని విజయసాయి రెడ్డి అన్నారు.

vsreddy 23082019 2

అయితే ఈ విషయం పై, రాష్ట్ర బీజేపీ నేతలు, అధిష్టానికి తెలియ పరిచారు. మరో పక్క మీడియాలో వచ్చిన వార్తలు చూసిన, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, విజయసాయి రెడ్డి వ్యాఖ్యల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. పోలవరం రీటెండరింగ్ విషయంలో, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే, స్పష్టమైన ఆదేశాలు రాష్ట్రానికి ఇచ్చిందని, స్వయంగా పార్లిమెంట్ లో అది తప్పు అని కేంద్రం తరుపున స్పందించినా కూడా, ఈ విషయం మోడీ, అమిత్ షా ఆశీస్సులతోనే జరుగుతుని అంటూ, విజయసాయి రెడ్డి ఎలా చెప్తారు అంటూ, ఆయన బీజేపీ నేతల వద్ద అగ్రహం వ్యక్తం చేసారు. నిన్న హైకోర్ట్ తీర్పు నేపధ్యంలో, రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ను కలిసారు.

vsreddy 23082019 3

పోలవరం విషయం పై మరో వారం రోజుల్లో కేంద్రం నుంచి స్పష్టత వస్తుందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై తదుపరి నిర్ణయం తీసుకునే ముందు మోదీ, అమిత్‌ షాతో చర్చిస్తానని మంత్రి వారికి చెప్పినట్లు తెలిసింది. విజయసాయి రెడ్డి హద్దు మీరి మాట్లడుతున్నారని, కేంద్రం తరుపున ఈ వ్యాఖ్యలు ఖండించాలని, లేకపోతే, ప్రజలు వీళ్ళ అసమర్ధతను, మన పై నెట్టేసే ప్రయత్నం చేస్తారని, అందుకే దీన్ని ఖండించాలని అన్నారు. మరో పక్క, పోలవరం రీటెండరింగ్‌ పై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందనే విషయం తెలియడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ హుటాహుటిన ఢిల్లీ వచ్చారు. ఈ విషయం పై, కేంద్ర జలవనరుల అధికారులతో చర్చించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read