సంబంధం లేని గొడవలోకి వెళ్లి, కేసిఆర్ మెప్పు పొందాలని చూసిన విజయసాయి రెడ్డికి, గట్టి షాక్ ఇచ్చారు టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్. రవి ప్రకాష్ కు,కేసీఆర్ కోటరీ అయిన మేఘా, రామేశ్వరరావు మధ్య, చిన్న సైజు యుద్ధమే నడుస్తుంది. టీవీ9 ని చేజేక్కించుకున్న తరువాత, రవి ప్రకాష్ ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. టీవీ9 కేసుల్లో, అరెస్ట్ చెయ్యకుండా రవి ప్రకాష్ కోర్ట్ కు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు. అయినా సారే, మరో కేసు పెట్టి, ఉన్నట్టు ఉండి రవి ప్రకాష్ ని అరెస్ట్ చేసారు. అయితే వీరి మధ్య జరుగుతున్న గొడవలోకి విజయసాయి రెడ్డి ఎంటర్ అయ్యారు. ఏకంగా సుప్రీం కోర్ట్ ఛీఫ్ జస్టిస్ కు లేఖ రాసి, ఆ లేఖను మీడియాకు విడుదల చేసారు. ఆ లేఖలో రవి ప్రకాష్ పై అనేక ఆరోపణలు చేసారు. రవి ప్రకాష్ అన్ని ఉల్లంఘనలు చేసారని, మనీ లాండరింగ్ చేసారని, అతని పై సిబిఐ, ఈడీ కేసులు పెట్టి, విచారణ చెయ్యాలని, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ను కోరారు విజయసాయి.
అయితే ఎవరైనా పిటీషన్ వేస్తారు. విజయసాయి రెడ్డి మాత్రం లేఖ రాయటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. అన్ని ఆధారాలు ఉంటె, కేసు ఫైల్ చేస్తే, సుప్రీం కోర్ట్ సరైన నిర్ణయం తీసుకుంటుంది. కాని, ఏదో ఒక ఉత్తరం రాసి, దాన్ని మీడియాకు లీక్ చెయ్యటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. ఈ వార్తా అన్ని టీవీ చానెల్స్ లో తో పాటుగా, సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. అయితే ఈ విషయం పై రవి ప్రకాష్ మాత్రం, జైలు నుంచి విజయసాయి రెడ్డికి షాక్ ఇచ్చే న్యూస్ చెప్పారు. విజయసాయిరెడ్డిపై పరువునష్టం దావా వేయాలని రవి ప్రకాష్ నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా, రూ. 100కోట్లకు పరువునష్టం దావా వెయ్యాలని రవి ప్రకాష్ నిర్ణయం తీసుకున్నారు. విజయసాయి రెడ్డి అబద్ధాలను వదిలేది లేదని చెప్తున్నారు.
గతంలో , ఇప్పుడు విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలే, రామేశ్వరరావు, మెఘా కృష్ణారెడ్డి అనుచరుడైన రామారావు చేశారని, ఇవన్నీ అసత్యమని అధికారులు తేల్చారని గుర్తు చేస్తున్నారు రవి ప్రకాష్ సన్నిహితులు. రామారావు నెలక్రితం పంపిన లేఖ కాపీనే ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు తన లెటర్ హెడ్‌పై పంపించారని ఆరోపిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై మలేషియా, సింగపూర్ విదేశీ నిధులు తరలించారంటూ అబద్ధపు ఫిర్యాదు చేసిన రామారావు, నెల క్రితం రవిప్రకాష్ పై ఆరోపణలు చేశారని రవి ప్రకాష్ సన్నిహితులు చెప్తున్నారు. వీటి అన్నిటి వెనుక పెద్దల హస్తం ఉందని, వారే ఇప్పుడు విజయసాయి రెడ్డి చేత, ఈ నాటకం ఆడిస్తున్నారని ఆరోపిస్తున్నారు.. ఈ నిరాధారమైన ఆరోపణలను అత్యుత్సాహంతో ప్రసారం చేసిన ఛానెళ్లపై కూడా చర్య తీసుకోవాలని నిర్ణయించినట్టు చెప్తున్నారు.