రాష్ట్రంలో పదవుల పందేరం జరుగుతుంది. అర్హతలు, సామర్ధ్యం లాంటివి ఏమి చూస్తున్నారో కాని, తమకు అనుకూలమైన వారి కోసం, మాత్రం పదవులే పదవులు. ఇది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరు. ఇది ఎంత వరకు వెళ్ళింది అంటే, సాక్షిలో పని చేసే ఉద్యోగులను, ప్రభుత్వంలో పెట్టే దాకా వెళ్ళింది. అయితే ఇప్పుడు తాజాగా చేసిన రెండు నియామకాలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వటం ఖాయం. చంద్రబాబు ఇంటి పై డ్రోన్ తిప్పిన కొంత మందిని, తెలుగుదేశం కార్యకర్తలు పట్టుకున్న విషయం తెలిసిందే. అత్యంత పటిష్ట భద్రతలో ఉండే చంద్రబాబు ఇంటి పై డ్రోన్ తిప్పటం, అది టీవీలకు ఇవ్వటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, ఆ పట్టుకున్న వారిని నిలదీయగా, తమను కిరణ్ అన్న పంపించారని, కిరణ్ అన్న, జగన గారికి అత్యంత సన్నిహితుడని, ఆయన డ్రోన్ తో చంద్రబాబు ఇంటిని షూట్ చెయ్యమంటేనే చేసామని అన్నారు.
అయితే ఆ కిరణ్ పై ఎన్ని కేసులు పెట్టినా, స్వయంగా చంద్రబాబు డీజీపీకి ఫోన్ చేసి, ఆ కిరణ్ ఎవడు నా ఇంటి పై డ్రోన్ తిప్పటానికి అని అడిగినా కూడా, అప్పుడు స్పందన లేదు. అయితే , ఇప్పుడు ఆ కిరణ్ అనే వ్యక్తికి, కీలక పదవి కట్టబెట్టారు జగన్ మోహన్ రెడ్డి. కిరణ్ ను, ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ గా, ప్రభుత్వం నియమించింది. అంటే, ఎంత ధైర్యంగా, వీళ్ళు చేస్తున్నారు అనేది అర్ధమవుతుంది. ఏకంగా చంద్రబాబు ఇంటి పై డ్రోన్ తిప్పిన వ్యక్తికి, పదవి కట్టబెట్టి, ఇది మేము చేసేది, ఏమి చేసుకుంటారో చేసుకోండి అని చాలెంజ్ చేస్తున్నారు. అధికారం ఉంది కాబట్టి, ఎవరికీ పడితే వారికి పదవులు ఇవచ్చు. కాని, ప్రతిపక్ష నాయకుడు ఇంటి పై డ్రోన్ ఎగరు వేసి, చంద్రబాబు పై దాడికి కుట్ర పన్నారు అని టిడిపి ఆరోపిస్తుంటే, ఆ వ్యక్తికి పదవి ఇవ్వటం ఏంటో.
ఇక జగన్ టూర్లు అన్నిటికీ, డ్రోన్ తో రికార్డు చేసింది కూడా ఇతనే అని వైసిపీ అంటుంది. ఇలా ఫోటోగ్రాఫర్లని, తన ఆఫీస్ లో పని చేసే విలేకరులని, తీసుకొచ్చి, ప్రభుత్వంలో పెడుతున్నారు. ఇక మరో నియామకం గురించి మాట్లాడితే, గత నెల 30వ, జగన్ దేవుడి బిడ్డ, అంటూ బహిరంగ సభలో ప్రశంసలు కురిపించిన, మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ కి కూడా బంపర్ ఆఫీసర్ ఇచ్చారు జగన్. ఆయన ఆ బహిరంగ సభలో తన పై కురిపించిన పొగడ్తలకో, లేక నిజంగానే ఆయన పై నమ్మకమో కాని, ఆయనకు అదనంగా మరిన్ని అధికారాలు కల్పిస్తూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక శాఖ సీఈవో, లీడర్ షిప్ ఎక్సలెన్స్, గవర్నెన్స్ ఎండీగా అదనపు పదవి ఇచ్చారు. ఇలా తనకు ఇష్టమైన వారికి, ఇష్టమొచ్చిన పదవులు ఇచ్చేస్తూ, ప్రభుత్వంలో స్థానం కల్పిస్తున్నారు.