పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, ఎన్నికలకు ముందు ఎన్నో మాటలు చెప్పారు. అయితే వారు చెప్పిన ఒక్క మాట మాత్రమే నిజం అయ్యింది. మేము గెలవకపోయినా పరవాలేదు, చంద్రబాబుని మాత్రం మళ్ళీ గెలవనివ్వను అని చెప్పిన పవన్ కళ్యాణ్, నిజంగానే మొన్న ఎన్నికల్లో, ఒక 30 స్థానాల వరకు, తెలుగుదేశం ఓటమికి కారణం అయ్యారు. అయితే జనసేన మాత్రం, కేవలం ఒక్క ఎమ్మెల్యేనే గెలిచింది. జనసేన నుంచి ఎన్నికైన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఒకే ఒక్క ఎమ్మల్యే కావటం, అందులోనూ దళితుడు కావటంతో, సహజంగా పార్టీలోని అన్ని వేదికల పై, ఆయనకు అవకాశం ఇవ్వాలి. కాని ఎక్కువగా, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ మాత్రమే కనిపిస్తూ ఉంటారు. అయితే, ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. పవన్ కల్యాణ్ ఇటీవలే పార్టీ ఆఫీస్ లో, పార్టీలోని అందరితో ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ కార్యక్రమాల పై ఈ సమీక్ష ఏర్పాటు చేసారు.
పవన్ కల్యాణ్ తో పాటుగా, నాదెండ్ల మనోహర్, మరో ఇద్దరు సీనియర్ నాయకులు వేదిక పై కూర్చున్నారు. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా వచ్చారు. ఏమి జరిగిందో తెలియదు కాని, రాపాక వచ్చి, మనోహర్ చెవిలో ఏదో చెప్పారు. ఆ సమయంలో కొంత అసహనానికి లోనైనా నాదెండ్ల, తన సీటులో నుంచి లెగిసి నుంచుని, రాపాకపై ఆగ్రహాన్ని ప్రదర్శించారు. మీరు ఆలస్యంగా వస్తే, మేమేం చేసేది. చీర పెట్టి, బొట్టు పెట్టి మిమ్మల్ని పిలవాలా? అంటూ రాపాకను ఉద్దేశించిన వ్యాఖ్యానించారు. తరువాత రాపాక ఒక కుర్చీ తీసుకని, నందేండ్ల పక్కన కూర్చున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు రోజుల నుంచి, ఈ వీడియో వైరల్ గా మారింది.
ఈ తంతంగం అంతా పవన్ కళ్యాణ్ గమనిస్తున్నారు. పార్టీ అధినేత సమక్షంలోనే, నాదెండ్ల ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని, నాదెండ్ల మనోహర్ వైఖరి పై జనసేన క్యాడర్ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. నాదెండ్ల మనోహర్ వల్లే పార్టీ నాశనమైందంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ను, నాదెండ్ల తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాపాక వరప్రసాద్ పార్టీకి ఉన్న ఒకే ఒక శాసనసభ్యుడని, అందులోను దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యే కాబట్టి, ఆయనకు సరైన గౌరవం ఇవ్వాలని, అసలు గెలవలేని నాదెండ్ల పెత్తనం ఏంటి అని, జనసేన కార్యకర్తలు అంటున్నారు. పవన్ కల్యాణ్ సమక్షంలోనే ఇదంతా చోటు చేసుకున్నప్పటికీ.. ఆయన నోరు మెదపక పోవడం పట్ల ప్రతికూల సంకేతాలు వెళ్తాయని వాపోతున్నారు. https://twitter.com/KYADHAV20/status/1182489438531620864