విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో తెలుగుదేశం శ్రేణులకు నిరుత్సాహానికి గురయ్యారు. ఎన్నికల ఫలితాలు తరువాత, మొదటి సారూ విశాఖపట్నం వస్తున్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి , ఘన స్వాగతం పలకటానికి, వైజాగ్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. అక్కడ నుంచి చంద్రబాబుని భారీ ర్యాలీ మధ్య తీసుకువెళ్లటానికి సన్నాహాలు చేసిన వేళ, పోలీసులు వారికి షాక్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. వైజాగ్ ఎయిర్ పోర్ట్ నుంచి, పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులతో కలిసి, చంద్రబాబు తన కాన్వాయ్ తో బయలుదేరగానే, పోలీసులు వచ్చి చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకున్నారు. ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని, మీ కాన్వాయ్ ఒక్కదానికే అనుమతి ఉంది అంటూ, పోలీసులు చంద్రబాబు కాన్వాయ్ ని ముందుకు కదల నివ్వలేదు. పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడ ఉండటంతో, ముందు జాగ్రత్తగా, అక్కడి నుంచి ఎన్ఏడీ జంక్షన్‌కు చంద్రబాబు కాన్వాయ్‌ను తరలించారు.
ఈ సమయంలో, ఎవరూ ఉద్రేకానికి లోను కావద్దని, వారు చెప్పినట్టే చేద్దాం అని, చంద్రబాబు చెప్పటంతో, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెయ్యలేదు. ఎన్ఏడీ జంక్షన్‌కు చేరిన చంద్రబాబు కాన్వాయ్‌ను, అక్కడ కార్యకర్తలు, నేతలను చెదరగొట్టి, అక్కడ నుంచి చంద్రబాబు కాన్వాయ్ ని పంపించారు. అంతకు ముందు కూడా, చంద్రబాబుకి స్వాగతం పలకటానికి వచ్చిన కార్యకర్తలను కూడా, ఎయిర్ పోర్ట్ కి రానివ్వకుండా, ఎన్ఏడీ జంక్షన్ వద్దే వారిని ఆపేశారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యేలు వాసుపల్లి, వెలగపూడి నిరసన తెలిపారు. మరికొందరు కార్యకర్తలను విమానాశ్రయంలోనూ పోలీసులు నిలిపివేశారు. అయితే, విజయసాయి రెడ్డి లాంటి చిన్న నేత వచ్చినా, హంగామా చేస్తూ వెళ్తారని, అప్పుడు లేని ఇబ్బంది, చంద్రబాబుకి స్వాగతం చెప్పటానికి వస్తే వచ్చిందా అంటూ తెలుగుదేశం నేతలు, పోలీసులను ప్రశ్నిస్తున్నారు.
పోలీసులు మాత్రం, మా పని మేము చేసాం అని, అంటున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా చంద్రబాబు ఇవాళ విశాఖ చేరుకున్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో నేతలతో సమీక్షా సమావేశం జరపనున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేశ్ ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు సహా రాష్ట్ర, జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాల నాయకులంతా హాజరవుతున్నారు. పార్టీ లెక్కల ప్రకారం ఒక్కో నియోజకవర్గం నుంచి 60 మందిని పిలిచారు. నాయకులతో కలిపి ప్రతీ సమీక్షకు వందమందికిపైగా హాజరయ్యే అవకాశం ఉంది. ఇక చంద్రబాబు ఈ రెండు రోజులు, కార్యాలయం ఆవరణలోనే చంద్రబాబు, ఆయన వ్యక్తిగత సహాయకులు, భద్రత సిబ్బంది బస చేస్తారు. ఆరుబయట పెద్ద తెరలు ఏర్పాటు చేసి షామియానాలు వేశారు.