రాజు తలుచుకుంటే, సామాన్య ప్రజలైనా, ఎవరైనా తల వంచాల్సిందేనా ? రేపు అనంతురం జిల్లాలో, జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. వైఎస్ఆర్ కంటి వెలుగు అనే పధకం ప్రారంభం చెయ్యటానికి, జగన్ అనంతపురం వెళ్తున్నారు. అయితే ఆయన సభ ఏర్పాటుల్లో భాగంగా, ఏర్పాట్లు కోసం, అధికారులు అత్యుత్సాహం చూపించారు. జగన్ వచ్చే బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లు కోసం, అక్కడ ఉన్న ఇల్లు తొలగించే ప్రయత్నం చేసారు. ఆ వేదిక వద్ద 50 ఏళ్ళుగా ఉంటున్న ఇళ్ళని, జేసీబీతో తొలగించారు. కేవలం ఆయన ఒక్క గంట మీటింగ్ కోసం, 50 ఏళ్ళుగా ఉంటున్న మా ఇళ్ళు తొలగిస్తారా అనే ఎదురు తిరిగిన స్థానికుల పై, అధికారులు దౌర్జన్యం చేశారు. ఈ తతంగం అంతా, దాదపుగా రెండు గంటల పాటు సాగింది. స్థానికులు ఎంత అడ్డు పడినా, అధికారంతో, వారిని పక్కకు తోసేసి, జేసీబీలతో ఇళ్ళు తొలగించారు.

meeting 09102019 2

అక్కడకు వచ్చిన మీడియా కవరేజ్ ని కూడా అడ్డుకున్నారు. మీడియా పై కూడా అధికారులు దౌర్జన్యం చేసారు. మునిసిపల్ అధికారులు, రెవిన్యూ సిబ్బంది దగ్గరుండి, పేదల ఇళ్ళు తొలగించారు. అక్కడ ఉన్న పేదల గుడిసెలు, పీర్ల చావిడి కూడా తొలగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పేదలు కావటంతో, బాధపడటం మినహా, అధికారులను నిలువరించలేక పోయారు. జగన్ ఒక్క గంట పాటు చేసే పర్యటన, అక్కడ 50 ఏళ్ళుగా ఉంటున్న నిరుపేదల పాలిట శాపంగా మారింది. చివరకు, అక్కడ ఉన్న పీర్ల చావిడిని తొలగించవద్దని ముస్లిం మత పెద్దలు అధికారుల వద్దకు వెళ్లి వేడుకున్నారు. అయినా అధికారులు కనికరించలేదు. దీంతో జేసిబీలతో అది కూడా కూల్చేసారు. మాకు ఆదేశాలు ఉన్నాయి అంటూ పడగోట్టేసారు.

meeting 09102019 3

అధికారుల చర్యల పై తెలుగుదేశం పార్టీ నేతలు మండి పడుతున్నారు. కంటి వెలుగు ప్రారంభోత్సవానికి వస్తున్న, ప్రభుత్వానికే ముందు కంటి పరీక్షలు చెయ్యాలని, వారికి పేదల కష్టాలు కంటికి కనిపించటం లేదని విమర్శిస్తున్నారు. అయితే, ఇప్పటికే ఈ పధకం చంద్రబాబు హయంలో ఉంది. తెలంగాణా కంటే ముందే, ఈ పధకం "ముఖ్యమంత్రి ఐ కేంద్రాల" పేరుతొ ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. తరువాత తెలంగాణా కంటి వెలుగు పేరుతొ పెట్టింది. చంద్రబాబు పెట్టిన ఈ పధకంలో, దాదపుగా 10 లక్షల మందికి పైగా కళ్ళ జోళ్ళు కూడా పంపిణీ జరిగింది. ఇప్పటికే ఉన్న ఈ పధకానికి, ఇంత హడావిడి ఎందుకని ? పేరు మార్చి, అదే కంటిన్యూ చెయ్యచ్చు కదా, అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read