కేంద్ర మాజీ మంత్రి, సినీ హేరో మెగాస్టార్ చిరంజీవి, జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు. ఆయన ఇందుకు కోసం, ఇప్పటికే, జగన్ మోహన్ రెడ్డిని అపాయింట్‌మెంట్ కోరారు. దీంతో చిరంజీవికి సీఎంవో కార్యాలయం అపాయింట్‌మెంట్ ఖరారు చేసింది. రేపు ఉదయం 11 గంటలకు రావాల్సిందిగా చిరంజీవిని కోరింది, సిఎంవో. దీంతో రేపు 11 గంటలకు, జగన్‌తో చిరంజీవి భేటీ కానున్నారు. చిరంజీవితో పాటుగా, ఆయన కొడుకు రామ్ చరణ్ కూడా జగన్ తో భేటీ అవుతారు. అయితే ఈ కలియక కేవలం సినిమాలకేనా, లేక రాజకీయ విషయాలు కూడా చర్చిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇటీవల చిరంజీవి నటించిన, 152వ సినిమా సైరా నరసింహారెడ్డి విడుదలైన సంగతి తెలిసిందే. చారిత్రాత్మిక సినిమా అని ‘సైరా నరసింహారెడ్డి’ని వీక్షించడానికి రావాల్సిందిగా జగన్‌ను చిరంజీవి, ఆయన కొడుకు, సినిమాకు ప్రొడ్యూసర్ కూడా అయినా రాం చరణ్ కోరనున్నారు.
‘సైరా’ సినిమాను వీక్షించాల్సిందిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను చిరంజీవి ఇటీవల కోరడం, ఆమె కుటుంబంతో కలిసి సినిమా చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంచిన విషయం తెలిసిందే. తొలితరం స్వాతంత్ర్య పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంపై సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తుండడం విశేషం. జగన్ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత చిరంజీవి తొలిసారి ఆయనతో భేటీ కాబోతున్నారు. అయితే ఇటీవల జగన్ పార్టీ నేత, ఎస్వీబీసి చైర్మెన్ అయిన పృధ్వీ, సినిమా ఇండస్ట్రీకి, జగన్ కనపడటం లేదని, సినిమా పెద్దలకు అహంకారం అంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే చిరంజీవి విషయంలో మాత్రం, జగన్ మోహన్ రెడ్డి, గత నెల రోజులుగా సానుకూలంగా ఉన్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగా ఇలా చేస్తున్నారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ని , నలుగురు నలుగురు పెళ్ళాలు అంటూ జగన్ విమర్శలు చేసిన దగ్గర నుంచి, కొంత గ్యాప్ పెరిగింది. అయినా సరే, సైరా సినిమా ఆడియో రిలీజ్ నుంచి, ప్రమోషన్ దాకా, అన్నీ జగన్ మీడియా అయిన, సాక్షి తన భుజాన ఎత్తుకుంది. ఇది వ్యాపారంలో భాగం అని చెప్పే వారు కూడా ఉన్నారు. అయితే, భారీ బడ్జెట్ సినిమా అయిన సాహో కి స్పెషల్ షో లకు పర్మిషన్ ఇవ్వని జగన్ ప్రభుత్వం, సైరాకి మాత్రం, అదనపు షోలకు అనుమతి ఇవ్వటం, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు చిరంజీవి, జగన్ తో భేటీ కానున్నారు. మరి, ఈ మొత్తం పరిణామం పై, జనసేన ఎలా స్పందిస్తుందో మరి.