నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అరాచకాలు, రోజురోజుకీ ఎక్కువ అయిపోతున్నాయి. ఇప్పటికే జర్నలిస్ట్ లను కొట్టటం, జామీన్ రైతు పత్రికా అధినేత ఇంటికి వెళ్లి వీరంగం చెయ్యటం చూసాం. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే, జగన్ కూడా నన్ను ఏమి పీకలేడు అనే సమాధానం ఆయన వద్ద నుంచి వస్తుందని వాపోయారు. ఈయన చేసిన పనులు, చేస్తున్న అరాచకాలు చూస్తుంటే, నిజంగానే జగన్ కూడా ఏమి చెయ్యాలేడా అనే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి రోజు ఏదో ఒక రాద్ధాంతం చెయ్యకుండా మాత్రం, కోటంరెడ్డి ఉండటం లేదు. తాజాగా మహిళా ఎంపీడీవో ఇంటికి వెళ్లి వీరంగం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి 11 గంటలకు జరిగిన ఘటన పై, ఎంపీడీవో సరళ మీడియాకు చెప్పిన వివరాలు ప్రకారం, కోటంరెడ్డి మద్యం తాగి వచ్చి, శుక్రవారం రాత్రి కల్లూరిపల్లి ఎంఐజీ కాలనీలోని తన ఇంటిపై దాడికి దిగారని చెప్పారు.

kotamreddy 05102019 2

ఆమె చెప్పిన వివరాలు ప్రకారం, తాను ఎంపీడీవోగా పని చేస్తున్న వెంకటాచలం మండలంలో వైసీపీ నాయకుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి బంధువు అయిన కృష్ణారెడ్డికి సంబంధించిన భూమిలో లేఅవుట్‌ వేశారని, దానికి వివిధ అనుమతులు ఇవ్వాలని శ్రీకాంత్‌రెడ్డి ఈ నెల 1వ తేదీన తన ఫోన్లో నుంచి రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డితో తనతో మాట్లాడించారని తెలిపారు. 2వ తేదీ సాయంత్రానికి అనుమతులు పని పూర్తి కావాలని కోటంరెడ్డి తనకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. అయితే అక్టోబర్ 2న సెలవు కావటం, అందులోనూ, ఆ రోజు సచివాలయాల ప్రారంభాలు ఉన్నందున అనుమతులు ఇవ్వటంలో జాప్యం అయ్యింది. అయితే అక్టోబర్ 2న కోటంరెడ్డి ఫోన్ చేసి, తాను చెప్పినా పని ఎందుకు లేట్ అయ్యింది అని, బూతులతో ఆ మహిళా ఎంపీడీవో పై బూతులతో విరుచుకు పడ్డారు. అక్టోబర్ 2న వివధ పనుల వల్ల కుదరలేదు అని ఆమె ఎంత చెప్పినా వినిపించుకోలేదు.

kotamreddy 05102019 3

దీంతో ఆయన సాయంత్రం కల్లూరిపల్లిలోని తన నివాసానికి ఆయన వచ్చారని, ఆ సమయంలో నేను ఇంట్లో లేనని, తన తల్లి ఉంటే ఆమెను దూషించి, నానా భీబత్సం చేసి, ఇంట్లోకి వచ్చే విద్యుత్‌ వైర్లను కట్‌ చేసి, తాగునీటి పైపులైను ధ్వంసం చేసి, కేబుల్ వైర్లను కట్ చేసి, వెళ్ళారని ఆమె చెప్పారు. ఎమ్మెల్యే తన ఇంటి పై చేసిన దౌర్జన్యం విషయం పై, పోలీస్ స్టేషన్ కు అర్ధరాత్రి స్వయంగా వెళ్లానని, కంప్లైంట్ తీసుకోవటానికి, ఒకరిద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నారని, అధికారులు లేకపోవటంతో, అక్కడే చెట్టు కింద కూర్చున్నాని చెప్పారు. అయితే అధికారులు ఏదో ఆక్సిడెంట్ కేసులో ఉన్నారని, కానిస్టేబుల్ చెప్పగా, వారు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటానని చెప్పిన ఆమెకు, చివరకు నిరాశే ఎదురైంది. అర్దరాత్రి ఒక మహిళా అధికారి, గంట సేపు ఎదురు చూసినా, ఒక్క అధికారి కూడా రాలేదు. విషయం తెలుసుకున్న, మండలంలోని గ్రామ కార్యదర్శులంతా ఆమెకు సంఘీభావంగా అక్కడికి చేరుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read