గత రెండు రోజులుగా వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మళ్ళీ వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. మహిళా ఎంపీడీవో ఇంటి పై దాడి చేసారనే ఆరోపణలతో, ఆయన పై కేసు నమోదు అయ్యింది. అయితే ఈ విషయం పెద్దది అవుతూ ఉండటంతో, జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగి, కోటంరెడ్డి పై వస్తున్న ఆరోపణలు నిజం అయితే యాక్షన్ తీసుకోండి అంటూ పోలీసులును కోరినట్టు వార్తలు వచ్చాయి. ఈ రోజు ఉదయం పోలీసులు కోటంరెడ్డిని అరెస్ట్ చేసారు. ఇంకేముంది, జగన్ మోహన్ రెడ్డి సూపర్ అంటూ ఆ పార్టీ కార్యకర్త నుంచి సామాన్యుడి దాకా అనుకున్నారు. అనుకున్నంత సేపు పట్టలేదు, కేసుని తుస్సు మానిపిస్తూ, బెయిల్ పై బయటకు వచ్చేశారు కోటంరెడ్డి. మహిళా ఎంపీడీవో కేసు ఫైల్ చెయ్యటానికి రెండు గంటలు పడితే, కోటంరెడ్డి బెయిల్ పై రావటానికి, గంట కూడా పట్టలేదు. ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి రాక ముందే, ఏదో మమ అనిపిస్తూ, ప్రభుత్వ ఉద్యోగి పై దాడి చేసినా, బెయిల్ వచ్చేలా చేసి, వదిలి పెట్టారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది.

kotamreddy 06102019 2

కోటంరెడ్డి అరెస్ట్ తరువాత, మీడియాతో మాట్లాడిన మాటలు, ఒక మహిళా ఎంపీడీవో పై దాడి దగ్గర నుంచి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్దన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల మధ్య వివాదంగా మార్చేసారు. అంటే జరిగిన ఇష్యూని డైవర్ట్ చేస్తూ, కొత్త చర్చను ప్రజల ముందు పెట్టారు. ఆరెస్ట్ తరువాత కోటంరెడ్డి మాట్లాడుతూ, తనపై నమోదైన కేసును రాజకీయకుట్రగా చెప్తూ, ఈ కేసు వెనుక వైసీపీ మండల అధ్యక్షుడు ఉన్నాడని, ఆ మండల అధ్యక్షుల వెనుక ఉన్న వైసీపీ పెద్ద తలకాయ ఎవరో జగన్ గారు విచారణ చేయాలని కోటంరెడ్డి కోరారు. తన ఇంటి పై దాడి చేసారని చెప్తున్న సరళ, ఆ రోజు, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఎమ్మెల్యే కాకాణి ఇంటికెళ్లారని ఆయన ఆరోపించారు. నెల్లూరు జిల్లా ఎస్పీకి కూడా ఇందులో పాత్ర ఉందని, ఆయనకు తన పై వ్యక్తిగత కక్ష ఉందంటు కోటంరెడ్డి చెప్పుకొచ్చారు.

kotamreddy 06102019 3

తమ బంధువు కృష్ణారెడ్డి వెంకటాచలం మండలంలో ఒక లే ఔట్ వేశారని, దానికి అన్ని అనుమతులు ఉన్నాయని, లేఔట్‌కు నల్లా కనెక్షన్ ఇవ్వాలని రెండు నెలలుగా అడుగుతున్నామని చెప్పారు. ఇదే విషయమై ఎంపీడీవోను అడిగితే ఎమ్మెల్యే కాకాణి ఇవ్వొద్దన్నారని చెప్పారని, ఎమ్మెల్యే కాకాణికి ఫోన్ చేస్తే, ‘‘నీకు తెలీదు శ్రీధరా..ఇప్పుడు కుదరదు" అన్నారని అని చెప్పుకొచ్చారు. అంతటితో తాను సైలెంట్ అయిపోయానని, ఇప్పుడు ఉన్నట్టు ఉండి కేసు పెట్టారని, ఆమె ఇంటి పై నేను దాడి చేసినట్టు తెలిస్తే, తనను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని జగన్ ను కోరతానని అన్నారు. అయతే ఈ కొత్త ట్విస్ట్ పై తెలుగుదేశం పార్టీ స్పందిస్తూ, ఇదంతా ఒక కొత్త డ్రామా అని, జరిగిన విషయం ఒక మహిళా ఎంపీడీవో ఇంటి పై దాడి అయితే, ఒక పార్టీలో ఉండే ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల గొడవగా చిత్రీకరిస్తూ, విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. నిన్నంతా ఈ విషయం పై చెప్పని కోటంరెడ్డి, పై నుంచి వచ్చిన ఆదేశాలు ప్రకారం, కొత్త స్క్రిప్ట్ చదివారని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read