నిన్న జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అధికారంలో కి వచ్చిన తరువాత, జగన్, ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలవటం, ఇది నాలుగవ సారి. అయితే గతంలో జరిగిన మూడు సార్లు కంటే, ఈ సారి పర్యటన భిన్నంగా సాగింది. గతంలో జగన్ ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో, ప్రధానితో పాటుగా, హోం మంత్రి అమిత్ షాని కలవటం, మరి కొంత మంది కేంద్ర మంత్రులను కలవటం జరుగుతూ వస్తుంది. తరువాత, ఆయన కాని, విజయసాయి రెడ్డి కాని, మీడియాతో మాట్లాడి, ప్రధానితో భేటీలో జరిగిన అంశాల పై మీడియాకు చెప్పే వారు. అయితే ఈ సారి మాత్రం, అందుకు భిన్నంగా జరిగింది. జగన్ మోహన్ రెడ్డి, కేవలం ప్రధానిని కలిసి, విజయవాడ వచ్చేసారు. ఒక పక్క విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతుంటే, బొగ్గు ఇవ్వమని కేంద్ర విద్యుత్ మంత్రికి వెళ్తారని అందరూ అనుకున్నారు. కాని అది జరగలేదు. అలాగే కేంద్ర జల శక్తి మంత్రి వద్దకు కూడా వెళ్ళలేదు. ఇక హోం మంత్రి అమిత్ షా వద్దకు కూడా జగన్ వెళ్ళలేదు.

jaganmodi 06102019 2

ఇది ఇలా ఉంటే, ప్రధాని మోడీతో భేటీ కూడా, అనుకున్నంత సాఫీగా జరగలేదని సంకేతాలు వచ్చాయి. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ప్రారంభం అయ్యే, రైతు భరోసా కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని మోడీని కోరగా, తనకు బిజీ షెడ్యూల్ ఉందని, రావటం కుదరదని ప్రధాని చెప్పినట్టు తెలుస్తుంది. సహజంగా, ఇలాంటి సందర్భంలో, ప్రధానిని ముందే అప్పాయింట్మెంట్ అడగటం, లేకపోతే ఆయనకు వీలు ఉన్న సమయం కనుకున్ని, పధకం ప్రారంభించటం జరుగుతుంది. కాని, ప్రధాని వద్ద నుంచి సానుకూల స్పందన లేకపోవటంతో, ఆయన రారు అనే విషయం అర్ధమైంది. అయితే, ప్రధానిని, జగన్ కలిసే, రెండు రోజుల ముందే, రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీలో వాలిపోయి, ప్రధానిని ఈ కార్యక్రమానికి, రావద్దు అని చెప్పినాట్టు సమాచారం. రైతు భరోసా పధకంలో, ఇచ్చే రూ.12,500లో, కేంద్ర వాటా 6 వేల కోట్లు ఉందని, కాని జగన్ మాత్రం ఈ పధకం పేరు వైఎస్ఆర్ భరోసా అని పెట్టారని, అధిష్టానికి ఫిర్యాదు చేసారు.

jaganmodi 06102019 3

ఒక పక్క కేంద్ర నిధులు పధకానికి వాడుతూ, ప్రధాని పేరు ఎక్కడ లేకుండా, బీజేపీకి ఎక్కడా క్రెడిట్ ఇవ్వకుండా, తన రాజకీయ ఎదుగుదల కోసం, వైఎస్ఆర్ పేరు వచ్చేలా ఈ పధకం పెట్టారని, అందుకనే ప్రధాని, రాకుండా చూడాలని, రాష్ట్ర బీజేపీ నేతలు, అధిష్టానానికి ఫిర్యాదు చెయ్యటంతో, ప్రధానిని ఇటు రాకుండా ఒప్పించారనే టాక్ నడుస్తాంది. ఇక ప్రధానిని కలిసిన వెంటనే, జగన్ మోహన్ రెడ్డి, అక్కడ వేచి ఉన్న మీడియాతో మాట్లాడకుండా, అక్కడ నుంచి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళిపోయారు. రెండు గంటలు అక్కడ నిరీక్షించిన మీడియాతో కనీసం మాట్లాడలేదు. అంతకు ముందు, 1-జన్‌పథ్‌ లో దిగిన జగన్ నివాసం దగ్గర ఉన్న మీడియాను కూడా, అక్కడ నుంచి పంపించే వేసారు. మీడియాతో నిత్యం సమన్వయం చేసుకునే రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులను కూడా, జగన్ నివాసంలోకి రానివ్వలేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read