ప్రభుత్వాలు వివిధ బ్యాంకుల నుంచి, వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకోవటం ఆనవాయతీ. కేంద్ర ప్రభుత్వం కాని, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఇలా రుణాలు తీసుకుని, వాటిని తీరుస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, ఇలా వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటూ వస్తుంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా, ప్రభుత్వ విధానాలు, భ్యవిషత్తు ప్రణాలికలు, చంద్రబాబు పరపతి, ఇలా వివిధ అంశాలు కలిపి, ప్రభుత్వం అడిగిన వెంటనే రుణాలు ఇవ్వటానికి ముందుకు వచ్చే వారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం ఆ నిధులు ఖర్చు పెట్టటం, వాటిని తీర్చటం జరుగుతూ వస్తుంది. తాజగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాని అప్పు అడిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, మూడు వేల కోట్లు అప్పు ఇవ్వమని, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాకు, గత నెల 23న దరఖాస్తు చేసుకున్నారు.

sbi 06102019 2

అయితే స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ నెల 30న వచ్చిన లేఖ చూసి, అధికార వర్గాలు అవాక్కయ్యాయి. మీరు ఇంత పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వమని అడిగారు, కాని మీ ఆర్ధిక పరిస్థితి ఒకసారి చూడండి, ఇప్పటికే ఉన్న అప్పులు తీరే మార్గం కనిపించటం లేదు, మీరు కొత్త అప్పు అడుగుతున్నారు, ఇంత అప్పు ఎలా తీరుస్తారు అంటూ, ప్రశ్నలు మీద ప్రశ్నలు వెయ్యటంతో, అధికారులు అవాక్కయ్యారు. సహజంగా వివధ కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వం, వివిధ సంస్థల నుంచి అప్పు తీసుకుంటూ, ఆ అప్పుకి రాష్ట్ర ప్రభుత్వం గారంటీ ఉంటుంది. దీంతో ప్రభుత్వమే గ్యారంటీ ఉంది కదా అని రుణాలు ఇవ్వటానికి ముందుకు వస్తారు. ఈ సారి కూడా పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అప్పు అడిగింది. గ్యారంటీ ఉంటానని కూడా చెప్పింది. ప్రభుత్వం ఈ అప్పుకి పూచీకత్తు ఇవ్వడానికి అంగీకారం తెలిపినా, ప్రభుత్వమిచ్చే పూచీకత్తుపై తాజాగా ఎస్‌బిఐ సందేహాలు వ్యక్తం చెయ్యటంతో అందరూ ఆశ్చర్యపోయారు.

sbi 06102019 3

ఇవి లేఖలోని మిగతా అంశాలు... "2017లో 9,665 కోట్ల రూపాయలుగా ఉన్న ప్రభుత్వ పూచీకత్తులు ఇప్పుడు రూ.35,964 కోట్లకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులు పెరిగిన తీరుకు ఇది నిదర్శనం. తాజాగా దరఖాస్తు చేసిన 3వేల కోట్ల రూపాయల మొత్తానికి నూరుశాతం భేషరతుగా ప్రభుత్వం పూచీకత్తు ఇస్తున్నప్పటికీ, చెల్లించాల్సిన అప్పు భారీగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ సామర్ద్యాన్ని పరిశీలించాలి. ప్రభుత్వ సొంత నిధులతో పోలిస్తే చెల్లించాల్సిన అప్పులు 714 రెట్లు అధికంగా ఉన్నాయి, ఇది అత్యంత అసాధారణం. అసహజం. నాలుగు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ బాండ్లకు క్రిసిల్‌ 'డి' గ్రేడ్‌ ఇచ్చింది. నిర్దిష్ట సమయంలో బాండ్లు సైతం చెల్లింపులకు నోచుకోవడం లేదనడానికి ఇది ఉదాహరణ. ఒక ప్రభుత్వం ఇచ్చిన పూచీకత్తును దాని స్థానంలో వచ్చిన కొత్త ప్రభుత్వం ఆమోదించడం లేదు." వీటితో పాటు, అప్పును ఎలా తీరుస్తారన్న విషయం పేర్కొనలేదని, ఎస్‌బిఐకి లేఖలో పెర్కుంది. ప్రభుత్వం ఈ లేఖకు ఇచ్చే సమాధానం బట్టి, ఎస్బీఐ లోన్ ఇచ్చే విషయంలో, ఒక నిర్ణయం తీసుకునే అవకాసం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read