ప్రతి సారి ఎదో ఒక వివాదంతో, లేకపోతే సెన్సేషన్ తో వార్తల్లోకి ఎక్కే సినీ నిర్మాత బండ్ల గణేష్, ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వైసీపీ నేత, విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా పని చేసిన, పీవీపీ, బండ్ల గణేష్ పై ఫిర్యాదు చేసారు. బండ్ల గణేష్ తో పాటుగా, అతని అనుచరుల పై కూడా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో, పీవీపీ కేసు నమోదు చేసారు. బండ్ల గణేష్ అనుచరులుగా చెప్పుకున్న కొంత మంది వ్యక్తులు, తన ఇంటికి వచ్చి, తన పై దౌర్జన్యం చేసారని పీవీపీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పీవీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, బండ్ల గణేష్ తో పాటుగా, అతని అనుచరుల పై 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తన పై కేసు నమోదు అయ్యింది అని తెలుసుకున్న బండ్ల గణేష్, తన నివాసం నుంచి వెళ్ళిపోయి, అండర్ గ్రౌండ్ కు వేల్లిపోయినట్టు సంమచారం. బండ్ల గణేష్ కోసం హైదరాబాద్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

bandla 05102019 2

అయితే ఈ వివాదానికి కారణం, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమాకు సంబంధించి విషయంగా తెలుస్తుంది. ఆ సినిమాకు, సినీ ఫైనాన్షియర్, సహ నిర్మాత పొట్లూరి వరప్రసాద్, బండ్ల గణేష్‌కు రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే సినిమా విడుదల సమయంలో కొంత చెల్లించి, మిగిలిన మొత్తానికి బండ్ల గణేష్ చెక్కులు ఇచ్చారు. మిగిలిన డబ్బును చెల్లించాలంటూ పీవీపీ, బండ్ల గణేష్ ను కోరారు. ఈ నేపధ్యంలోనే, నిన్న అర్ధరాత్రి కొంత మంది బండ్ల గణేష్ అనుచరులుగా చెప్పుకునే వ్యక్తులు, పీవీపీ నివాసానికి వెళ్లి ఆయన పై బెదిరింపులకు పాల్పడి, ఆయన పై దౌర్జన్యం చేసినట్టు చెప్తున్నారు. దీని పైనే, పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చెయ్యటం, 448, 506, రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద బండ్ల గణేష్‌తో పాటు నలుగురిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

bandla 05102019 3

ఇది ఇలా ఉంటే, పరారీలో ఉన్న బండ్ల గణేష్, ట్విట్టర్ ద్వారా జగన్ కు వేడుకులు చెప్తూ, ఒక లేఖ రాసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీవీపీ నుంచి తనను కాపాడాలని, జగన్ ను కోరారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ గారికి... సార్ మమ్మల్ని అందరినీ పివిపి బారి నుంచి కాపాడండి..అంటూ ట్వీట్ చేసారు. జగనన్న రాజ్యం వచ్చిందని ఆనందంతో బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇలాంటి దుర్మార్గుడిగా చేతినుంచి కాపాడండి సార్ అంటూ వేడుకున్నారు. ఓడిపోయిన కేసులు కూడా మళ్లీ డబ్బులు కావాలి అని బెదిరించి మాట్లాడితే, ఆంధ్రప్రదేశ్ నా చేతుల్లో ఉంది మీ అందర్నీ చంపేస్తాను అని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. అందరూ ఆంధ్రప్రదేశ్లో అవినీతి లేని పాలన జరుగుతుందని ఆనంద పడుతూ ఉంటే తులసివనంలో గంజాయి మొక్కలు వీరు చేస్తున్న క్రమంలో మీ పార్టీకి నీకు చెడ్డ పేరు వస్తుందని బండ్ల గణేష్ సూచించారు. మీ పేరు చెప్పి చిత్రపరిశ్రమలో అందర్నీ బెదిరిస్తున్నారు దయచేసి కట్టడి చేయండి అంటూ బండ్ల గణేష్ తన ట్వీట్ ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను అభ్యర్దించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read