ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ, కధనాలు ప్రసారం చేస్తున్న ఛానెల్స్ ని తట్టుకులేక, వాటిని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. గత 15 రోజులుగా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానల్స్ ను బ్యాన్ చేస్తూ అనధికారిక ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సిటి కేబుల్ తో పాటుగా, ఏపి ఫైబర్ నెట్ లో కూడా ఈ రెండు ఛానల్స్ ఆపేశారు. అయితే, అప్పటి నుంచి ఈ రెండు చానల్స్ విషయంలో, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జర్నలిస్ట్ సంఘాలతో పాటుగా, ప్రజలు కూడా ఈ ఛానల్స్ ఇవ్వాలి అంటూ ఆందోళన చేస్తున్నారు. దీని పై కొంత మంది ప్రేక్షకులు, ట్రాయ్ కి కంప్లైంట్ ఇవ్వటం కూడా చేసారు. మరో పక్క ఈ విషయం పై ప్రభుత్వం మాత్రం ఏమి స్పందించటం లేదు. జర్నలిస్ట్ సంఘాలు ఎంత ఆందోళన చేసినా, ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినా, ప్రభుత్వం మాత్రం, ఈ విషయంలో, గత 15 రోజుల నుంచి స్పందించటం లేదు.

abn 24092019 2

అయితే ప్రభుత్వం అకారణంగా తమ ఛానల్ ని బ్యాన్ చేసిందని చెప్తూ, టెలికామ్ వివాదాల పరిష్కార సంస్థ (ది టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్‌మెంట్ అండ్ అప్పీలేట్ అథారిటి)లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫిర్యాదు చేసింది. ఈ రోజు ఈ విషయం పై విచారణ జరిపిన ట్రిబ్యునల్, ఆంధ్రజ్యోతికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కనీసం నోటిసులు కూడా ఇవ్వకుండా ఛానెల్ ప్రసారాలు ఎలా నిలిపేస్తారని, ఏబిఎన్ తన పిటీషన్ లో పేర్కొంది. పిటిషన్ విచారణకు స్వీకరించిన ట్రిబ్యునల్, నోటీసులు కూడా ఇవ్వకుండా ఎందుకు ఆపారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏబీఎన్ ప్రసారాలను రెండు రోజుల్లోగా పునరుద్దరించాలంటూ ప్రభుత్వానికి సంబందించిన ఫైబర్ నెట్‌కు, ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

abn 24092019 3

అయితే ఫైబర్ నెట్ తరుపున న్యాయవాదాలు వాదిస్తూ, కావలని చెయ్యలేదని, సాంకేతిక సమస్యలు ఉన్నాయని, అందుకే కొంచెం అంతరాయం కలిగింది అంటూ, కుంటి సాకులు చెప్పే ప్రయత్నం చెయ్యగా, ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏబీఎన్‌ ప్రసారాల నిలిపివేతలో నిబంధనలు పాటించలేదని ట్రిబ్యునల్ తీవ్రఆగ్రహం వ్యక్తం చేసింది. సాంకేతిక సమస్యలంటూ సాకులు చెప్పొద్దని, రెండు రోజుల్లో ఛానెల్ ప్రసారాలు ప్రారంభం కావాలని ఆదేశాలు ఇచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్స్‌ కన్నా న్యూస్ చానెళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల గొంతు వినిపించే చానెల్స్‌ విషయంలో మరింత జాగ్రత్త వహించాలని ఫైబర్ నెట్‌కు టీడీ శాట్‌ చైర్మన్‌ శివకీర్తి సింగ్ సూచించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read