ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా ఉన్న సురేంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన్ను బదిలీ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న కృష్ణబాబుకు కొత్తగా, ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు అప్పగించారు. అయితే సురేంద్ర బాబుకి మాత్రం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా షాక్ ఇచ్చారు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా సురేంద్రబాబును ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఆర్టీసీ ఎండీగా ఉన్న సురేంద్ర బాబు ఆకస్మిక బదిలీ పై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒక పక్క
ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేస్తున్న వేళ, ఇలాంటి సీనియర్, సమర్ధత ఉన్న ఆఫీసర్ ని మార్చటం చర్చనీయాంశంగా మారింది. 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా సురేంద్ర బాబు ఉన్నారు. ఆయాన్ డీజీపీ ర్యాంకు అధికారి. ఇలాంటి అధికారికి పోస్టింగ్ ఇవ్వకుండా జీఎడి కి రిపోర్ట్ చేయాలని అదేశాలు ఇవ్వటం పై విస్మయం వ్యక్తం అవుతుంది.
ఒక పక్క ఇప్పటికే, గతంలో పని చేసిన, దాదపుగా 10 మంది దాక ఒకే సామాజికవర్గానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు పోస్టింగ్ ఇవ్వకుండా, వారిని నాలుగు నెలల నుంచి ఖాళీగా కూర్చోపెట్టటం పై, విమర్శలు వస్తున్నాయి. ఒకే సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ, ప్రభుత్వం వెళ్తుందనే విమర్శలు వస్తున్న వేళ, ఇప్పుడు మరోసారి సురేంద్ర బాబు లాంటి ఆఫీసర్ ని, బదిలీ చేసి, డీజీపీ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ కు, ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా పక్కన పెట్టటం పై, సర్వత్రా చర్చనీయంసం అయ్యింది. సురేంద్రబాబు, చంద్రబాబు మొదటి సారి సియంగా ఉండగా, విజయవాడ పోలీస్ కమీషనర్ గా చేసారు. ఆ సమయంలో, ఆయన ఎంతో దూకుడుగా వెళ్తూ, బెజవాడ రౌడీజం లేకుండా చేసారు. టిడిపి పార్టీ నేతలు అధికారంలో ఉన్నా, తప్పు చేసారంటే వదిలి పెట్టె వారు కాదు.
ఈ నేపధ్యంలోనే సురేంద్రబాబుకి రాష్ట్రమంతా మంచి ఆఫీసర్ గా పేరు వచ్చింది. ఎలాంటి వేషాలు వెయ్యకుండా రోడీలను కంట్రోల్ చేసే వారు. అయితే చంద్రబాబు మొన్న సియంగా ఉండగా, సురేంద్రబాబుకి డీజీ ర్యాంక్ ఇచ్చి, ఆర్టీసి ఎండీని చేసారు. తరువాత ఆయనకు డీజీపీ ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, మొత్తం తారు మారు అయ్యింది. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చెయ్యటం వివాదాస్పదం అయ్యింది. చంద్రబాబు ఉన్న సమయంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబి వెంకటేశ్వరరావుకి, ఇప్పటి వరకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వని సంగతి తెలిసిందే. అలాగే గతంలో డీజీపీగా ఉన్న ఠాకూర్ ని, ప్రింటింగ్ అండ్ స్టేషనరీలో వేసారు. మరి ఇప్పుడు సురేంద్రబాబుకి ఎప్పటికి పోస్టింగ్ ఇస్తారో, ఎలాంటి శాఖ ఇస్తారో అనేది వేచి చూడాలి.