జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీకి కేసులు కొత్త కాదు. జగన్ మోహన్ రెడ్డి పై 31 కేసులు ఉన్నాయి. మొన్నటి దాక ఆయన ప్రతి శుక్రవారం కోర్ట్ కు వెళ్ళే వారు. అలాగే జగన్ కేసుల్లోనే, ఆయన భార్య పై కూడా కేసు నమోదు అయ్యింది. ఇక జగన్ తండ్రి దివంగత వైఎస్ఆర్ పై కూడా అమెరికాలో టైటానియం లాంటి పెద్ద కేసు ఉంది. ఇక జగన్ బావ, వైఎస్షర్మిల భర్త అయిన అనిల్ పై కూడా కేసు ఉంది. అయితే, ఇప్పుడు ఈ కేసు విషయంలోనే, జగన్ బావ అయిన, ప్రముఖ క్రైస్తవ మత ఉపన్యాసకుడు బ్రదర్ అనిల్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. ఆయన పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది కోర్ట్. కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా, అరెస్ట్ చేసి, అతన్ని తమ ముందు హాజరు పరచాలని కోర్ట్, పోలీసులకు ఆదేశాలు ఇవ్వటం, ప్రస్తుతం హాట్ టపిక్ గా మారించి. ఒక పక్క జగన్ ఇక్కడ సియంగా ఉండటం, పక్కన రాష్ట్రంలో ఆయన స్నేహితుడు కేసిఆర్ అధికారంలో ఉండి కూడా, ఆయన బావకు అరెస్ట్ వారంట్ రావటంతో వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోయారు.
ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో రాష్ట్రంలో ఖమ్మం పట్టణంలో ఉన్న న్యాయస్థానం, జగన బావ, బ్రదర్ అనిల్ కుమార్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ఇష్యూ చేసింది. ఎన్నికల కోడ్ అఫ్ కాండక్ట్ ను ఉల్లంఘించిన కేసులో ఆయనకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా రాలేదని, ఆయన న్యాయస్థానానికి హాజరు కాకపోవడం వల్ల ఈ నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ ను ఇచ్చారు. 2009 ఎన్నికల సమయంలో, 2009 మార్చి 28వ తేదీన బ్రదర్ అనిల్ కుమార్ ఎన్నికల కోడ్ అఫ్ కాండక్ట్ ఉల్లంఘించారంటూ ఆయన పై కేసు నమోదు చేసారు పోలీసులు. ఖమ్మం కరుణగిరి ప్రాంతంలో ఆయన వైసిపీకి అనుకూలంగా ఆయన ప్రచారం చేశారని, రూల్స్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసారని అప్పట్లో ఆయనపై కేసు నమోదైంది.
ఆ టైంలో, ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తరువాత కూడా, ఆయన కరుణగిరిలో ప్రచారం చేస్తూ, చర్చిలో ప్రార్థనలు జరిపి, ఓటర్లను లోబర్చుకునే నిమిత్తం డబ్బు పంపిణీకి యత్నించారని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. వాటి ఆధారంగా ఖమ్మం రూరల్ పోలీసులు అనిల్‌తో పాటు మరో ముగ్గురిపై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఆయన కరపత్రాలు కూడా పంచారని బ్రదర్ అనిల్ కుమార్ పై కేసు పెట్టారు పోలీసులు. అయితే ఆ కేసులో ఏ1గా ఉన్న అనిల్ కుమార్ ఎన్ని సార్లు కోర్ట్ పిలిచినా, రాలేదు. దీనితో ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం కోర్ట్ లో హాజరుపరచాలని ఖమ్మం సెకెండ్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి జస్టిస్ ఎం జయమ్మ ఆదేశాలు ఇస్తూ, ఈ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసారు.