గల్లా జయదేవ్.. అమరాన్ బ్యాటరీ అధినేతగా, గల్లా అరుణ కుమారి లాంటి పవర్ ఫుల్ నేత కొడుకుగా సుపరిచితం. అయితే 2014లో చంద్రబాబు అవకాసం ఇవ్వటంతో, గుంటూరు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే, ఆయనకు ఎంపీగా కంటే, పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఆయన ఇచ్చిన స్పీచ్ కు, రాష్ట్ర వ్యాప్తంగానే కాక, దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మోడీ ప్రభుత్వ విధానాలు ఎండ గడుతూ, మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేసారో చెప్తూ, మోడీ సభలో ఉండగానే, ఆయన వైపు చూస్తూ, "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, వి ఆర్ నాట్ ఫూల్స్" అంటూ గర్జించిన పేరు ఉన్న నేత. 2019 ఎన్నికల్లో రెండో సారి వరుసగా గుంటూరు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే, గల్లా జయదేవ్ గా కాకుండా, కనీసం ఆయన ఎంపీ పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా, గుంటూరు జిల్లాలో ఒక ఉన్నతాదికారి ప్రవర్తిస్తున్న తీరుతో, ఎంపీ గల్లా, తీవ్ర అవమానంగా ఫీల్ అవుతున్నారు.

galla 17082019 2

సహజంగా, నియోజకవర్గ పరిధిలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు, అక్కడ స్థానికంగా ఉన్న ఎంపీకి, ప్రతి విషయం పై కబురు పంపించాల్సిన అవసరం, అధికారులకు ఉంటుంది. అయితే గల్లాకి కాని, ఎంపీ నియోజకవర్గ పరిధిలో ఉండే, తెలుగుదేశం ఎమ్మెల్యేలకు కాని, ఆ అధికారి కనీసం సమాచారం ఇవ్వటం లేదు. అక్కడ వైసీపీ నేతలు, ఏది చెప్తే అది చేస్తున్నారనే పేరు వచ్చింది. ఈ పరిణామం పై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. అధికార పార్టీకి గులాంలు కొట్టే అధికారులను చూసాం కాని, ఇంత ఇదిగా వంగి పోయే అధికారులను ఇప్పుడే చూస్తున్నాం అంటున్నారు. అయితే, ఆ అధికారితో డైరెక్ట్ గా తేల్చుకోవటానికి, ఇటీవల గల్లా జయదేవ్, ఆ అధికారి కార్యకలయానికి వెళ్లారు. అయితే గల్లా వచ్చిన విషయం చూసి కూడా, కనీసం స్పందించకుండా, తల వంచుకుని తన పని తాను చేసుకుంటూ కూర్చున్నాడు.

galla 17082019 3

మరోసారి ఎంపీ గల్లాని ఆ అధికారి అవమానపరిచారు. దీంతో గల్లా, తాను చెప్పాలి అనుకున్నది తనకు చెప్పి వచ్చేశారు. తమను, తమ పార్టీ ఎమ్మెల్యేల పై ప్రొటోకాల్‌ ఉల్లంఘిస్తున్నారని, నగరాభివృద్ధికి సంబంధించిన సమావేశాలకు కనీసం సమాచారం ఇవ్వటం లేదని, తమకు గౌరవం ఇవ్వకపోతే, మీ పంధా మార్చుకోక పొతే, న్యాయ పరంగా వెళ్తామని, ప్రివిలేజ్ కమిటికి ఫిర్యాదు చేస్తామని, ప్రజా ప్రతినిధులకు హక్కులు ఉంటాయనే విషయం గుర్తుంచుకొండి అంటూ, ఆ అధికారి పై గల్లా ఫైర్ అయ్యారు. అయితే తెలుగుదేశం నేతలు మాత్రం, ఆ అధికారి మొన్నటి వరకు తమకు గౌరవం విచ్చే వారని, ప్రభుత్వం మారటంతోనే, అతనిలో మార్పు వచ్చిందని, రాజకీయ నాయకులు చొక్కాలు మార్చినంత ఫాస్ట్ గా అధికారులు కూడా భజన చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read