గత 5 ఏళ్ళ తెలుగుదేశం పార్టీ హయంలో, ఎలాంటి విష ప్రచారాలు జరిగినియ్యో అందరికీ తెలిసిందే. 5 ఏళ్ళలో అన్ని కులాలను విడగొట్టి, తెలుగుదేశం పార్టీకి దూరం చేస్తూ, నడిపిన క్యాంపైన్ ఎంతో సక్సెస్ అయ్యింది. సరైన టైంలో తెలుగుదేశం పార్టీ ఆ విష ప్రచారాన్ని తిప్పి కొట్టలేక పోవటంతో, ఏకంగా ఆ కులాల్లో చీలిక వచ్చి, అధికారమే కోల్పోవాల్సి వచ్చింది. సినిమాల దగ్గర నుంచి, ప్రతి విషయంలోనూ కులాన్ని లాగి, ఒక విష సంస్కృతిని తీసుకు వచ్చారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీలకు గ్యాప్ వచ్చేలా కూడా పని చేసారు. ఇందులో ముఖ్యంగా ఒక ప్రముఖ ఛానెల్, పేపర్ ఆ పనికి లీడ్ తీసుకుంటే, కొన్ని వెబ్ సైట్స్ అదే పనిగా విషయం చిమ్మాయి. ఇవి తీసుకుని, సోషల్ మీడియాలో ఒక ప్రణాళిక ప్రకారం ప్రచారం చేసారు. తెలుగుదేశం పార్టీకి జరగాల్సిన నష్టం జరిగింది.

lokesh 19082019 2

అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా, ఇలాంటి విష ప్రచారమే చేస్తున్నారు. అయితే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మారింది. విష ప్రచారం చేస్తుంటే, వెంటనే ఖండిస్తున్నారు. తాజగా, ప్రభాస్ సాహో సినిమా పై, విషం చిమ్మే ప్రయత్నం జరుగుతుంది. తన సినిమా ప్రమోషన్లో భాగంగా, ప్రభాస్ ఒక తమిళ వెబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంలో, అక్కడ యాంకర్, కొన్ని పేరులతో ఉన్న కార్డ్స్ పెట్టి, ఒక్కో కార్డు తియ్యమని ప్రభాస్ ని కోరారు. ఆ కార్డు మీద ఎవరి పేరు అయితే ఉంటుందో, వారి గురించి అభిప్రాయం అడిగారు. అలా కొంత మంది పేరులతో ఉన్న కార్డ్స్ తీసిన తరువాత, జగన్ పేరు కూడా వచ్చింది. యాంకర్ మాట్లాడుతూ, జగన్ ఇప్పుడు పొలిటికల్ బాహుబలి కదా, మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. దానికి ప్రభాస్ స్పందిస్తూ, నాకు పాలిటిక్స్ గురుంచి పెద్దగా తెలియదు, i "think" he will do very good. He is a young CM. I think AP will be very beautiful. Let's wait and see అని అన్నారు.

lokesh 19082019 3

అయితే ప్రభాస్, జగన్ ని పొలిటికల్ బాహుబలి అన్నారు అంటూ వైసీపీ ప్రచారం చెయ్యటంతో, కొంత మంది ఓవర్ గా రియాక్ట్ అయ్యే తెలుగుదేశం కార్యకర్తలు, ప్రభాస్ పై కొంత కోపగించుకుంటూ పోస్ట్ లు పెట్టారు. గతంలో కృష్ణంరాజు చంద్రబాబుని తిట్టారు అంటూ, అదీ ఇదీ కలిపి కొన్ని పోస్ట్ లు పెట్టారు. అయితే, దీనికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిది. కాని, వైసిపీకి అనుకూలంగా ఉండే ఓక వెబ్ సైట్ మాత్రం, ఇదంతా తెలుగుదేశం ప్లాన్ అని, ప్రభాస్ సినిమా ఫ్లోప్ చెయ్యటానికి తెలుగుదేశం ప్లాన్ చేస్తుందని రాసారు. అయితే, ఈ విష ప్రచారం వెనుక, రాజులను, తెలుగుదేశం పార్టీకి దూరం చెయ్యాలనే కుట్ర ఉంది. ఇది గ్రహించిన తెలుగుదేశం పార్టీ వెంటనే స్పందించింది. నారా లోకేష్ దీని పై ట్వీట్ చేస్తూ, ఆ వెబ్ సైట్ మాడు పగిలేలా స్పందించారు. ఈ అబద్ధాలు రాసిన నకిలీ జర్నలిస్టు సిగ్గుపడాలి. కుల విభజన, విద్వేషం నింపి సంపాదించిన సొమ్ముతో తిండి ఎలా తింటున్నారు? మీకు మనస్సాక్షి అనేదే లేదా?. సాహో ఓ భారీ బడ్జెట్ చిత్రం. ఈ అద్భుతమైన సినిమాను చూడ్డానికి ప్రభాస్ ఫ్యాన్స్ లాగా నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. సాహో చిత్రాన్ని ప్రభాస్ ఫ్యాన్సే కాదు, టీడీపీ కార్యకర్తలు కూడా చూసి, ఆ పనికిమాలిన కథనాన్ని తిప్పి కొట్టండి" అంటూ ట్వీట్ చేశారు. దీని పై , బాగా బుద్ధి చెప్పారు అంటూ టిడిపి అభిమానులు, ప్రభాస్ ఫాన్స్, లోకేష్ చర్యను మెచ్చుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read