పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, చంద్రబాబు ముద్రలు చేరిపేయాలని చూస్తూ, బాగా పని చేస్తున్న నవయుగ కంపెనీని, తీసేసి, కొత్త టెండర్ ను పిలవాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పై అటు కేంద్రం కాని, ఇటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కాని మొదటి నుంచి గుర్రుగానే ఉన్నారు. అయినా సరే జగన్ ప్రభుత్వం మాత్రం, ముందుకే వెళ్తుంది. ఎందుకు ఇంత తొందర, కేంద్రం నిర్ణయం తీసుకునే దాకా ఎందుకు ఆగారు, అని ప్రశ్నించినా, మొండిగా ముందుకు వెళ్తున్నారు. దీంతో ఈ విషయం పై, కేంద్రం నిన్న సీరియస్ అయ్యింది. మా మాట వినండి అని చెప్పినా, 4 గంటల్లోనే రివర్స్‌ టెండర్లకు నోటిఫికేషన్‌ జరీ చేసిన జగన్ ప్రభుత్వం పై, కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఈ విషయం పై పూర్తీ స్థాయి నివేదక మాకు ఇవ్వండి అంటూ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో ఆర్కే జైన్‌ను కోరింది.

jagan 20082019 2

అయితే ఇప్పటికే ఈ విషయం పై జైన్, ప్రాధమిక నివేదిక కేంద్రానికి ఇచ్చారు. అలాగే తాను రాష్ట్రానికి రాసిన లేఖలు కూడా, కేంద్రానికి పంపించారు. అలాగే జైన్ తో కేంద్ర అధికారులు ఫోన్ లో కూడా మాట్లాడారు. ఈ రోజు, రేపటి లోపు , నివేదిక కేంద్రానికి ఇస్తామని చెప్పారు. బుధవారం, కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌ ఈ విషయం ద్రుష్టి పెట్టి, తగిన సూచనలతో, ప్రధానిని కూడా కలిసే అవకాసం ఉందని తెలిస్తుంది. అయితే జగన్ అనవసర పట్టుబదలతో, పరిస్థితి చేయి దాటుతుందేమో అని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. ఈ షాక్ నుంచి కోలుకోక ముందే, మరో గంటలోనే, మరొక వార్తా రాష్ట్రాన్ని కలవర పెట్టింది. మమ్మల్ని అకారణంగా పోలవరం ప్రాజెక్ట్ నుంచి తప్పించారని, కారణం చెప్పకుండా తొలగించారని, నవయుగ కోర్ట్ కి వెళ్ళింది.

jagan 20082019 3

నవయుగ ఈ అడుగు వేస్తుందని, జగన్ ప్రభుత్వం భావించలేదు. వాళ్లకి రాష్ట్రంలో కాంట్రాక్టు లు కావాలంటే, ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటారు, అదీ కృష్ణపట్నం పోర్ట్ కూడా నవయుగ చేతిలో ఉంది కాబట్టి, వాళ్ళు ఇంత దూకుడుగా వెళ్తారని ప్రభుత్వం భావించలేదు. అయితే నవయుగ మాత్రం, మేము రికార్డు స్థాయిలో పని చేసి, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చాం, ప్రాజెక్ట్ ని దూకుడుగా చేసి, 73 శాతం పూర్తీ చేస్తే, మేము ఏ తప్పు చెయ్యకుండా, తప్పించారని, కోర్ట్ కు వెళ్లారు. పనులు మమ్మల్ని కొనసాగనించాలని, వేరే సంస్థకు అవకాసం ఇవ్వకుండా చూడాలని కోర్ట్ ని కోరారు. అయితే ఈ వరుస వివాదాల నేపధ్యంలో, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం మరుగున పడేలా కనిపిస్తుంది. ఒక పక్క కోర్ట్ లో ఉండటం, అలాగే కేంద్రానికి మండి, మళ్ళీ వాళ్ళే ప్రాజెక్ట్ బాధ్యతలు తీసుకుంటే, ఇక పోలవరం ఇప్పుడప్పుడే అయ్యే అవకాశమే లేదు. చూద్దాం ఏమి జరుగుతుందో ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read