ఏపీఎస్ ఆర్టీసీ గత వారం రోజులుగా వార్తల్లో నిలిస్తుంది. ఆర్టీసి విలీనం కోసం వచ్చే వార్తల్లో కాదు. పోలవరం రివర్స్ టెండర్ లో దక్కించుకున్న మేఘా సంస్థకు, ఆర్టీసి ఎలక్ట్రిక్ బస్సుల అద్దె టెండర్ లో, క్విడ్ ప్రోకో కింద, మేఘా సంస్థకు చెందిన కంపెనీకి కాంట్రాక్టు ఇస్తున్నారు అంటూ, ప్రత్యర్ధులు చేస్తున్న ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కింది. ఇది కాక ఎండీని అకస్మాత్తుగా బదిలీ చెయ్యటం, చైర్మెన్ కు నోటీస్ ఇవ్వటం కూడా, అనుమానాలకు తావిచ్చింది. తాజగా ఈ రోజు ఆర్టీసి చైర్మెన్ గా ఉన్న వర్ల రామయ్యను, చైర్మెన్ పదవి నుంచి తప్పుకోవాలి అంటూ, ప్రభుత్వం నోటీస్ పంపించింది. మీకు నెల రోజులు గడువు ఇస్తున్నాం, ఈ లోపు మీరు తప్పుకుంటే సరి, లేకపోతే, మిమ్మల్ని మేమే తప్పిస్తాం అంటూ,ప్రభుత్వం ఆ నోటీస్ లో ఘాటుగా స్పందిస్తూ, వర్ల రామయ్యకు నోటీస్ పంపించింది. ఇప్పుడు ఇదే చర్చనీయంసం అయ్యింది.
ఎలేక్టిక్ బస్సులు టెండర్లు ఖరారు చెయ్యాలి అంటే, ఆర్టీసి చైర్మెన్ గా ఉన్న వర్ల రామయ్య సంతకం పెడితేనే టెండర్ ఒకే అయ్యే అవకాసం ఉందనే ప్రచారం జరుగుతుంది. అందుకే టెండర్ తేదీలకు అంటే ముందే, వర్ల రామయ్యను తప్పించి, తమకు అనుకూలంగా ఉండే వారిని పెట్టుకోవటానికి ప్రభుత్వ పెద్దలు సిద్ధం అయ్యారు. అందుకే వర్ల రామయ్యను తప్పించే పనిలో భాగంగా, ఈ నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం మారిన తరువాత వర్ల రామయ్య, ఆర్టీసి వ్యవహారాలు ఏమి చూడకపోయినా, ఆయన సాంకేతికంగా ఇంకా ఆర్టీసి చైర్మెన్ గానే ఉన్నారు. అయితే, వర్ల రామయ్య దీని పై స్పందించారు. ఏప్రిల్ 26వ తేదీన నా పదవి కాలం ముగిసింది, తప్పుకోండి అంటూ నాకు నోటీస్ పంపించటం విడ్డురంగా ఉంది.
పదవీ కాలం ముగిసిపోతే, ఇంకా నా రాజీనామా ఎందుకు, అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. తాను జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఆర్టీసీ ఆఫీసుకు రావడం లేదని, అలాగని రాజీనామా చేయలేదని, ప్రభుత్వం తొలగిస్తే, తొలగించుకోవచ్చని వర్ల రామయ్య అన్నారు. అయితే మూడు రోజుల క్రితం ఎండీగా ఉన్న సురేంద్రబాబును, ఉన్నట్టు ఉండి బదిలీ చెయ్యటం, ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వక పోవటం, ఇప్పుడు ఆర్టీసి చైర్మెన్ గా ఉన్న వర్ల రామయ్యను టార్గెట్ చెయ్యటం, ఇవన్నీ చూస్తుంటే, ఎలేక్టిక్ బస్సుల డీల్ కోసమే, వీరిని తప్పించారని, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పోలవరంలో తక్కువకు ఇస్తున్నాం అని చెప్పి, ఇక్కడ అధిక రేట్లకు, కట్టబెట్టే పని చేస్తున్నారని, దీని వెనుక పెద్ద క్విడ్ ప్రో కో ఉంది అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.