అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌, గత కొంత కాలంగా, జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా గోదావరిలో జరిగిన బోటు ప్రమాదం పై, ఆయన జగన్ పై, మంత్రుల పై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి లాంటి అసమర్ధుడు సియం అవ్వటం మన ఖర్మ అని, ఇలాంటి అసమర్ధుడిని ఇప్పటి వరకు చూడలేదని, కనీసం బోటు కూడా తియ్యలేని వాడు, మనల్ని పాలిస్తున్నాడు అంటూ, తీవ్ర పరుష వ్యాఖ్యలు చేసారు. గోదావరిలో మునిగిపోయిన బోటులో, మంత్రి అవంతి శ్రీనివాస్ కు వాటాలు ఉన్నాయని ఆరోపించారు. బోటులో అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని ఆరోపించారు. ఘోర బోటు ప్రమాదం జరిగి, ఇంకా 16 మృతదేహాలు దొరక్క పొతే, ఇప్పటికీ బోటు బయటకు తియ్యలేదని, అది బయటకు తీస్తే, అందులోనే లోపాలు బయట పడుతాయనే, ఇన్నాళ్ళు బోటు తియ్యకుండా ఉన్నారని ఆరోపించారు.

harshakumar 30092019 2

రెండున్నర నుండి 5 కిలోమీటర్ల లోతు వరకు రోబోట్లను పంపించే టెక్నాలజీ కృష్ణా గోదావరి బేసిన్‌లో ఉంటే, కేవలం 215 మీటర్లు కింద ఉన్న బోటుని కూడా తియ్యటం లేదని అన్నారు. అంతే కాదు, బోటులో 73 కాదని, 93 మంది ఉన్నారని హర్ష కుమార్ ఆరోపించారు. దాదపుగా 10 రోజుల నుంచి, హర్ష కుమార్ బోటు ప్రమాద బాధితుల తరుపున, ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. అయితే ఇది ఇలా జరుగుతూ ఉండగానే, హర్ష కుమార్ ని అరెస్ట్ చెయ్యటానికి, నిన్నటి నుంచి పోలీసులు చూడటం సంచలనంగా మారింది. ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నందుకే, హర్ష కుమార్ ని టార్గెట్ చేసారని, అందుకోసమే, ఆయన్ను ఎలా అయినా నోరు మూయించటానికి, ఇలా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు.

harshakumar 30092019 3

అసలు కేసు ఏంటి అంటే, రాజమహేంద్రవరంలో శనివారం ఆక్రమణల కూల్చివేతకు సంబంధించిన ఘటన పై, అక్కడ వారికి అండగా ఉండి, మాట్లాడుతూ.. న్యాయస్థానం అధికారులను దూషించారనే కేసు విషయంలో హర్షకుమార్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను రెవెన్యూ అధికారులు కోర్టు ఆదేశాల మేరకు తొలగించారు. ఆ క్రమంలో బాధితులను పరామర్శించేందుకు ఘటనా స్థలానికి చేరుకున్న హర్షకుమార్‌ ‘న్యాయస్థానం అధికారులను బెదిరించారని’ జిల్లా కోర్టు చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి పి.సీతారామరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం మున్సిపల్‌కాలనీ వద్దనున్న హర్షకుమార్‌ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన లేకపోవడంతో ఇంటిని సోదా చేసిన అనంతరం వెనుదిరిగారు. ఏ క్షణంలో ఆయన వచ్చినా అదుపులోకి తీసుకునేందుకు కొందరు అక్కడే వేచి ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read