అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, వైసీపీ నేతలు, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏకంగా చంద్రబాబుతో పాటుగా, గెలిచిన ఎమ్మెల్యేల పై బదులు తీర్చుకునే పనిలో ఉంది వైసీపీ. గెలిచిన 23 మందిని టార్గెట్ చేస్తూ, వారిని కూడా ఎమ్మెల్యే పదవిలో లేకుండా చెయ్యటానికి, సాంకేతిక అంశాలు వెతుకుతున్నారు. ఈ నేపధ్యంలోనే, నిన్న హైకోర్ట్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి నోటీసులు ఇచ్చింది. ఆయన కుప్పం ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు ఎన్నికల అఫిడవిట్ లో, తప్పుడు సమాచారం ఇచ్చారు అంటూ, ఆయాన ఎన్నిక రద్దు చెయ్యాలి అని కోరుతూ, వైసిపీ అభ్యర్ధిగా, చంద్రబాబుతో పోటీకి దిగిన, కృష్ణ చంద్రమౌళి, హైకోర్ట్ లో ఎన్నికల పిటీషన్ వేసారు. చంద్రబాబు గెలుపును సవాల్ చేస్తూ వేసిన పిటీషన్ పై, చంద్రబాబుకు శనివారం, హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది.

amaravati 29092019 2

ఎన్నికల రిటర్నింగ్ అధికారితో పాటు, ఇతర ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేసింది హైకోర్ట్. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ శనివారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. చంద్రబాబు ఆదాయ మార్గాల ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించకుండా చంద్రబాబు గోప్యంగా ఉంచారని, ఆయన ముఖ్యమంత్రిగా పొందిన విషయాన్ని అఫిడవిట్ లో వెల్లడించలేదని అభియోగం. అలాగే కృష్ణా జిల్లా, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటుగా అప్పటి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వల్లభనేని వంశీ ఎన్నికను రద్దు చేయాలంటూ, గన్నవరం వైసీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకటరావు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

amaravati 29092019 3

ఎన్నికల ప్రచారం సమయంలో వంశీ సూచన మేరకు ఆయన ప్రతినిధులు ఇంటి స్థలాల నకిలీ పట్టాలను పంచి ప్రలోభ పెట్టారని తెలిపారు. అలాగే ఎన్నికల లెక్కింపు ప్రక్రియ చట్ట విరుద్ధంగా జరగడంతో తాను 990 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యానని వెల్లడించారు. అందుకే వల్లభనేని వంశీని, ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని యార్లగడ్డ హైకోర్ట్ లో పిటీషన్ వేసారు. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్ట్, న్యాయమూ, వంశీతో పాటు రిటర్నింగ్‌ అధికారికి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ కేసు పై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. అయితే దీని పై తెలుగుదేశం నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు. చిన్న చిన్న అంశాలను కూడా పెద్దగా చూపించి, ఎదో లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read