జగన్ మోహన్ రెడ్డి గారికి అధికారం రావటంతో, ఆయన వర్గీయులు అందరికీ పదవులు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. అయితే కొంత మందికి మాత్రం, అమితంగా, ఒకటి కంటే ఎక్కువ పదవులు ఇస్తున్నారు. ఉదాహరణకు, జగన్ మోహన్ రెడ్డి గారికి, నెంబర్ టు అయిన విజయసాయి రెడ్డి విషయానికి వస్తే, ఆయన ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన అంటే జగన్ మోహన్ రెడ్డి గారికి అమితమైన ఇష్టం కాబట్టి, విజయసాయి రెడ్డిని పార్లమెంటరీ పార్టీ హెడ్ గా చేసారు. అంతే కాదు, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. అంతే కాదు, మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ ని చేసారు. ఇలా అనేక పదవులు ఇచ్చారు. ఒకే వ్యక్తకి ఇన్ని పదవులు ఇచ్చి, ఆ వ్యక్తి అంటే తనకు ఎంత నమ్మకమో చెప్పకనే చెప్పారు. అయితే ఇప్పుడు అలాగే మరి కొంత మందికి కూడా ఇలాగే ఎక్కువ పదవులు ఇస్తున్నారు.

vishnu 05092019 2

ఉదాహరణకు, వైసీపీ పార్టీకి చెందిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు, ఎమ్మెల్యేగా ఉన్నా సరే, ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి తోడు, ఆయనను ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ సంస్థ ఛైర్మన్ పగ్గాలను అప్పగించే యోచనలో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. ఆ పదవితో పాటుగా, ఎంతో పోటీ ఉన్న, ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా కూడా అవకాసం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు నేడో, రేపో వెలువడం ఖాయమని మల్లాది విష్ణు వర్గీయులు చెప్తున్నారు. అయితే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఒకే వ్యక్తి ఇన్ని పదవులు ఇవ్వటం కంటే, అదే సామాజికవర్గానికి చెందిన మరికొందరికి, ఈ పదవి ఇవ్వచ్చు కదా అనే వాదన వినిపిస్తుంది.

vishnu 05092019 3

అయితే జగన్ మోహన్ రెడ్డి మాత్రం, తనను నమ్ముకున్న వారినే ఆదిరిస్తారని, ఆయనకు నమ్మకం ఉన్న వారికే పదవులు ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక మరో పక్క మల్లాది విష్ణు, స్వర్ణా బార్ విషయంలో , కల్తీ మద్యం తాగి చనిపోయిన విషయంలో, ఆయన పై ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారికి టిటిడి పదవులు ఇవ్వటం మంచిది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వేళ మల్లాది విష్ణు కాకపొతే, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఓడిపోయినా ద్రోణంరాజు శ్రీనివాస్ కు ఆ పదవి ఇవ్వచ్చు అనే వాదన వినిపిస్తుంది. ద్రోణంరాజు శ్రీనివాస్ పేరును కూడా జగన్ పరిశీలనలోకి ఉందని చెబుతున్నారు. అయితే తమ నేతకు మాత్రం ఎదో ఒక పదవి రావటం ఖాయం అని, మల్లాది విష్ణు వర్గీయులు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read