జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నేటికి సరిగ్గా 100 రోజులు అయ్యింది. ఈ వంద రోజుల్లో ఎన్నో సమస్యలు ప్రజలను చుట్టుముట్టాయి. ముఖ్యంగా ఇసుకని వదలకపోవటంతో, రాష్ట్రం పడుకుంది. ఇక కేసిఆర్ అన్ని తిట్లు ఆంధ్రులని తిట్టినా, ఆయనతో చట్టా పట్టాల్ వేసుకుని తిరగటం, గోదావరి నీళ్ళు ఇస్తాను అనటం కూడా, ఆంధ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రత్యేక హోదా మెడలు వంచి తెస్తాను అని చెప్పి, ఇప్పుడు ప్లీజ్ సార్ ప్లీజ్ అంటున్నారు. ఇక మరో పక్క రాష్ట్రానికి రెండు కళ్ళు అయిన అమరావతి, పోలవరం రెండూ ఆగిపోయాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టత్మకంగా చెప్పిన నవరత్నాలు ఇంకా మొదలు కాలేదు. మరో పక్క రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది. ఇన్ని కష్టాల మధ్య జగన్ మోహన్ రెడ్డి ఈ రోజుతో వంద రోజులు పూర్తీ చేసుకున్నారు. జగన్ కి కలిసి వచ్చిన అంశం ఏదైనా ఉంది అంటే, అది పై నుంచి వరదలు వచ్చి, నీళ్ళు రావటం. అది కూడా సరైన వాటర్ మ్యానేజ్ మెంట్ చెయ్యలేక, సీమను ఎండబెట్టారు.
అయితే జగన్ మోహన్ రెడ్డి వంద రోజుల పాలన పై, తనదైన శైలిలో స్పందించారు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఈ వంద రోజుల్లో జగన్ పడుతున్నాడు, లేగుస్తున్నాడు, కాని జగన్ ను చెయ్యి పట్టి నడిపించే వాడు చాలా అవసరం అని జేసీ అన్నారు. గత ప్రభుత్వం అంటూ అక్కడే ఆగిపోయారని, ప్రతి విషయాన్ని మైక్రోస్కోపులో చూస్తూ, పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దాలని కాని, దాన్ని నేలకేసి కొట్ట కూడదు అని అన్నారు. ఈ మూడు నెలల్లో పెట్టుబడులు లేవు, ఒక్క ఉద్యోగం వచ్చింది లేదు అని చెప్పుకొచ్చారు. అయితే ఒక్క ఉద్యోగం రాకపోయినా, ఆర్టీసీని తెచ్చి అనవసరంగా ప్రభుత్వం నెత్తిన పెడుతున్నారని జగన్ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలపటం, ప్రభుత్వానికి అదనపు భారం తప్ప, దాని వల్ల ఏ ఉపయోగం ఉండదని అన్నారు.
ప్రభుత్వం ఎప్పుడూ వ్యాపారం చెయ్యకూడదు అని, ఆర్టీసీ చేసిడి వ్యాపారం అని, అలాంటిది ప్రభుత్వం ఆర్టీసీని తీసుకోవటం ఆశ్చర్యం వేసింది అని అన్నారు. రాజధాని అమరావతి పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, అమరావతి ఎక్కడికీ వెళ్ళదని, రాజధాని అమరావతిలోనే ఉంటుందని అన్నారు. ఇవన్నీ చెప్తూనే, మా వాడు చాలా తెలివైన వాడు అంటూ చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, జగన్ మావాడే అంటూ చెప్పుకొచ్చారు. అయితే జగన్ పార్టీలో ఎప్పుడూ చేరుతున్నారని అని అడగగా, నన్ను ఎవరూ ఆ పార్టీలోకి రానివ్వరని, కాని జగన్ మోహన్ రెడ్డి కోరితే మాత్రం, కొన్ని సలహాలు ఇస్తానని చెప్పుకొచ్చారు. మొత్తం మీద, జగన్ వంద రోజుల పాలన పై జేసీ కామెంట్స్ తో మళ్ళీ హీట్ రేగింది. మరి వైసిపీ దీని పై ఎలా స్పందిస్తుందో చూడాలి.