ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మదిలో ఉన్న ఆందోళన, పోలవరం, అమరావతి పై జగన్ మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో అని. ఇప్పటి వరకు పోలవరం పై జగన్ ప్రభుత్వం అన్నీ ఆందోళన కలిగించే నిర్ణయాలే తీసుకుంటుంది. ఒక పక్క నవయుగ కోర్ట్ కి వెళ్ళటంతో, అది ఎప్పటికి కొలిక్కి వస్తుందో తెలియదు. ఒకసారి కోర్ట్ కు వెళ్తే, ఆ విషయం తేలటానికి ఎన్ని ఏళ్లు పడుతుందో అందిరికీ తెలుసు. ఇక మరో పక్క, కేంద్రం కూడా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. పోలవరం పై ఇష్టం వచ్చినట్టు చెయ్యవద్దు అని, మేము చెప్పినట్టే వినాలని రాష్ట్రానికి వార్నింగ్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చేత కంప్లీట్ రిపోర్ట్ తెప్పించుకుని, ఆ విషయం పై త్వరలో ఒక నిర్ణయం ప్రకటించ నుంది. ఈ నేపధ్యంలో పోలవరం ప్రాజెక్ట్ పై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరి పై, అందరూ స్పందిస్తున్నారు.

jp 05092019 2

ఈ కోవలోనే, లోక్‌సత్తా వ్యవస్థాపకులు డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ, పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోవటం పై విశాఖలో స్పందించారు. పోలవరం ప్రాజెక్ట్ ని నిర్మాణం చెయ్యకుండా, నిలిపివేయటం, రాష్ట్రానికి మంచిది కాదని అన్నారు. ఒకసారి ప్రాజెక్ట్ ఆపితే, మళ్ళీ దాన్ని గాడిలో పెట్టాలంటే, ఎంతో శ్రమ పడాలని, ప్రభుత్వం పోలవరం ఆపటం రాష్ట్రానికి మంచిదికాదని జేపీ అన్నారు. విశాఖపట్నంలో, ద్వారకానగర్‌ పౌరగ్రంథాలయంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి స్మారకోపన్యాసం’లో జేపీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి’ అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ తో, ఉత్తరాంధ్ర ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పారు.

jp 05092019 3

పోలవరం ఎడమకాలువ ద్వారా నీటిని విజయనగరం జిల్లాకు తెచ్చి అక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లాలో నిలిచిపోయిన ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిచేస్తే ఉత్తరాంధ్ర నీటితో సస్యశ్యామలం అవుతుందని జేపీ అన్నారు. గోదావరి జలాలను వాడుకునే విషయంలో, ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ఆలోచన మంచిదే కాని, ఆ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్న విధానం మాత్రం సరైంది కాదని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి ఎన్నిక పై సంస్కరణలు రావాలని, ముఖ్యమంత్రులను నేరుగా ఎన్నుకోవడం ద్వారా ఎమ్మెల్యేలపై ప్రభుత్వాలు ఆధారపడే సమస్య లేకుండా వ్యవస్థ ఉండాలని అన్నారు. ఈ విధానం అప్పట్లో వైఎస్ఆర్ కి చెప్తే, దీన్ని బలపరిచి, కొంత మేర ఈ దిశాగా ఆలోచనలు జరిపారని, జేపీ గుర్తు చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read