వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో, నిందితుడు మొన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం ఎంత సంచలనం అయ్యిందో అందరికీ తెలిసిందే. రెండు రోజుల్లోనే, ఆ వార్త కనుమరుగు అయిపోతుంది అనుకోండి అది వేరే విషయం. అయితే హైప్రొఫైల్ కేసుల్లో ఈ సీరియల్ మరణాలు కొత్త కాదు. గతంలో పరిటాల రవి హత్య కేసులో నిందితులు అందరూ చనిపోయారు. మొన్న వైఎస్ వివేక నిందితుండు ఆత్మహత్య చేసుకోగానే, అందరికీ పరిటాల రవి కేసు గుర్తుకు వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న నిందితుడు రాసిన లేఖల్లో, చేతి రాత తేడా ఉందనే వార్తలు వచ్చాయి. అయితే, రెండు రోజుల్లో అందరూ ఆ వార్త మర్చిపోయారు. ఇప్పుడు ఇలాంటి వార్త మరొకటి సంచలనం సృష్టిస్తుంది. అయితే, ఈ వార్త మాత్రం ఇప్పుడు సంచలనం ఎందుకు అయ్యింది అంటే, ఇది జగన్ మోహన్ రెడ్డికి చెందిన కేసు కాబట్టి.

kodikatti 06092019 2

జగన్ మోహన్ రెడ్డి పాదయత్రలో ఉండగా, జగన్ పై కోడి కత్తితో కలిసి దాడి చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయ్యింది. ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్న కోడి కత్తి శీను, సంచలన వ్యాఖ్యలు చేసాడు. తనను రాజమండ్రి సెంట్రల్ జైలులో చంపేందుకు పెద్ద కుట్ర పన్నారని ఆరోపించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న శ్రీను, తనపై జైలర్, జైలు వార్డెన్ దాడి చేశారనీ, చిత్ర హింసలకు గురిచేస్తున్నారని, తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, వెంటనే ఈ విషయాన్ని శ్రీనివాస్ కేసు వాదిస్తున్న లాయర్ అబ్దుల్ సలీం దృష్టికి తీసుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న లాయర్ సలీం మాట్లాడుతూ, శ్రీనివాస ని జైలులోనే చంపే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

kodikatti 06092019 3

శ్రీనివాస్ భద్రత పై కోర్ట్ లో పిటీషన్ వేస్తామని లాయర్ సలీం తెలిపారు. జైలులో శ్రీనివాస్ పై దాడి చేసారని, గాయాలయ్యాయని, ఈ దాడి, పై జైలు అధికారుల పై సెక్షన్ 307 కింద కేసులు పెడతామని అన్నారు. శ్రీనివాస్ కు రాజమండ్రి జైల్లో భద్రత లేదనీ, విశాఖ జైలుకు బదిలీ చేయాలని కోర్టును కోరతామని లాయర్ సలీమ్ తెలిపారు. ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన కేసు, రాజమండ్రి జైలులో ఉన్న శ్రీనివాస్ చేసిన ఈ ఆరోపణలతో మరింత కలకలం రేగింది. హై ప్రొఫైల్ కేసుల్లో జరుగుతున్న విషయాలు గమనిస్తున్న ప్రజలు, ఈ ఆరోపణల పై కూడా ఏదో జరగబోతుంది అనే ఆలోచనకు వచ్చారు. ఎవరి పైన అయినా దాడి చెయ్యటం, చంపటం నేరం. మొన్న కోడి కత్తి శీను, జగన్ ను గుచ్చటం అయినా, ఈ రోజు శీను ఆరోపిస్తున్నట్టు తన పై జరిగిన దాడి అయినా, ఏదైనా సరే తప్పే అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read