రాజకీయాల్లో ఎన్నో వింతలు చూస్తూ ఉంటాం. అందులో అలాంటి ఒక వింత, భర్త ఒక పార్టీలో ఉంటే, భార్య మరో పార్టీలో ఉండటం. ఇలాంటివి మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. అది కూడా దగ్గుబాటి లాంటి బలమైన ఫ్యామిలీలో. ఎన్నికల సమయంలో, ముందు జాగ్రత్తగా, భర్త కొడకు వైసీపీలో చేరితే, పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే ఉన్నారు. మొన్న ఎన్నికల్లో, పర్చూరు నియోజవర్గం నుంచి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆయన కొడుకు హితేష్ కు ముందు టికెట్ ఇద్దాం అనుకున్నా, సాంకేతిక కారణాలతో, ఆయనకు టికెట్ ఇవ్వటం కుదరకపోవటంతో, దగ్గుబాటి వెంకటేశ్వరరావు రంగంలోకి దిగారు. అయితే, ఎన్నికల రణరంగంలో ఓడిపోయారు. ఆయన ఓడిపోయినా కూడా, ఆ నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలను వైసీపీ తరుపున చూస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ కావటంతో, ఓడిపోయినా సరే, అధికారులను కంట్రోల్ పెట్టుకుని పనులు చేపిస్తున్నారు.
మొన్న జరిగిన బదిలీల్లో కూడా, తన మాట నెగ్గేలా దగ్గుబాటి పావులు కదిపారు. ఎస్సై బదిలీ విషయంలో ఒక వివాదం కాగా, దగ్గుబాటి చేసిన సిఫార్సు మేరకు మంత్రి బాలినేని ఆదేసలాతో, ఎస్పీ అక్కడకు బదిలీ చేసిన ఎస్సైను వెంటనే బదిలీ చేసారు. ఇటీవల కాలంలో, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కొడుకుతో కలిసి, మండలాల వారీగా పార్టీ నేతలతో సమీక్షలు చేస్తూ, అలాగే అధికారులతో కూడా సమీక్ష్ చేస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యవహారం, మరీ దూకుడుగా ఉండటం, అదే సమయంలో ఆయన భార్య పురందేశ్వరి, బీజేపీ నేతగా ఉంటూ, జగన్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తూ, పోరాటాలు చెయ్యటంతో, జగన్ ఈ విషయం పై దృష్తి సారించారు. పర్చూరు నియోజవర్గం పై నిరంతర నిఘా పెట్టారు. ఇంటలిజెన్స్ ని రంగంలోకి దించి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు పై రోజు వారీ రిపోర్ట్ లు తెప్పిస్తున్నారు.
జగన మొహన్ రెడ్డి స్వయంగా, ఇవి చూస్తున్నారు. జగన ఆదేశాల మేరకు, ఇంటెల్సిజెన్స్ శాఖ అధికారులు ప్రత్యేకంగా పర్చుర్ నియోజకవర్గ సమాచారాన్ని ఎప్పటికప్పుడు, ప్రభుత్వానికి ఇస్తున్నారు. అయితే ఏకంగా సొంత పార్టీ నేత పైనే నిఘా పెట్టటం, అటు కొంతమేర అధికారుల్లోను ఇటు వైసీపీ నాయకుల్లోను చర్చకు దారి తీసింది. ప్రకాశం జిల్లాలో రాజకీయంగా కూడా ఇది ప్రాధాన్యం సంతరించుకునిం, హాట్ టాపిక్ అయ్యింది. జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో కూడా, జగన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరా మరీ లైన్ దాటకుండా చూడాలని, ఇది అందరికీ మంచిందని, ఆయాన దూకుడుగా వెళ్తే తనకు వెంటనే చెప్పాలని, జగన్ ఆదేశించినట్టు తెలుస్తుంది. మొత్తానికి, సొంత పార్టీ నేత, అందులోనూ సీనియర్ నేత పై నిఘా పెట్టటం, ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.