ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళం జిల్లలో రాజాకీయ వైరంతో, ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళంలో, ఈ రాజకీయ కక్షలు చూస్తున్న ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతల పై కేసులు పెడుతున్న జగన్ ప్రభుత్వం, శ్రీకాకుళంలో కూడా ఇదే ఒరవడి కొనసాగిస్తుంది. టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్‌ పై కేసు పెట్టి, ఆయన్ను అరెస్ట్ చెయ్యటానికి ప్రయత్నిస్తూ ఉండటంతో, కూన అండర్ గ్రౌండ్ కు వెళ్ళిపోయారు. సరిగ్గా పండగ ముందు, వరుస సెలవులు చూసుకుని, ఆయనకు బెయిల్ రాకుండా, నాలుగు రోజుల పాటు జైల్లో ఉంచే స్కెచ్ వెయ్యటంతో, అది పసిగట్టిన కూన రవి కుమార్, అండర్ గ్రౌండ్ కు వెళ్లారు. రేపు ఆయన పోలీసులు ముందుకు హాజరయ్యే అవకాసం ఉంది. అయితే, ఇందులో కూన రవికుమార్‌ చేసిన తప్పు కూడా పెద్దగ ఏమి లేదు.

tammineni 02092019 2

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి వలంటీర్ల నియామకంపై అధికారులను రవికుమార్‌ ప్రశ్నించిన తీరు వివాదానికి కారణమైంది. సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారు అంటూ, ఆయన పై కేసు పెట్టారు. మొత్తం 11 మంది కేసు పెట్టగా, 10 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసారు. రవికుమార్‌ అందుబాటులో లేకపోవటంతో, శ్రీకాకుళం శాంతినగర్‌ కాలనీలో రవికుమార్‌ ఇంటి ముందు పోలీసులు నిఘా పెట్టారు. అంతే కాకుండా, సెర్చ్ వారెంట్ లేకుండా తమ ఇంట్లో తనిఖీలు చేపట్టారని మహిళలమని చూడకుండా... దౌర్జన్యంగా వ్యవహరించారని, ఈ వ్యవహారం మొత్తానికి కారణం, స్పీకర్ తమ్మినేని సీతారం అంటూ, కూన రవికుమార్‌ భార్య ప్రమీల ఆరోపించారు. స్పీకర్ ఒత్తిడితోనే, ఏమి లేని చోట కూడా కేసు పెట్టి, ఇలా వేధిస్తున్నారని, పండగ పూట కూడా ఇంట్లో లేకుండా చేసారని, ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

tammineni 02092019 3

అయితే ఆమె ఆరోపణల పై స్పీకర్ తమ్మినేని ఘాటుగా స్పందించారు. ఇష్టం వచ్చినట్టు, అందరి పై నోరు పారేసుకుంటే, ఇలాగే ఉంటుంది, హద్దుల్లో ఉండాలి అంటూ మండిపడ్డారు. ఎవరో కేసు పెడితే, తనకేం సంబంధం అంటూనే, స్పీకర్ హోదాని పక్కన పెట్టి రాజకీయ విమర్శలు చేసారు కూన రవికుమార్, అచ్చెన్నాయుడుల క్రిమినల్ ట్రాక్ తీస్తే, ఎవరు ఎంతో తెలుస్తుంది అంటూ హెచ్చరించారు. అయితే స్పీకర్ వ్యాఖ్యల పై, ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రంగా స్పందించారు. స్పీకర్ గా ఉంటూ, ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. నేరజాబితా తీస్తే మొదట గుర్తొచ్చేది మీ అధినేత జగన్ పేరే అని గుర్తుంచుకోవాలని రామ్మోహన్ రాయుడు ధ్వజమెత్తారు. అధికారం ఉందని విర్రవీగొద్దని, మా మీద కక్ష తీర్చుకోవటం కాకుండా, ప్రజలకు ఉపయోగపడే పనులు చెయ్యాలని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read