వైఎస్ విజయమ్మ బయటకు వచ్చారు అంటే, అక్కడ జగన్ ఎదో ఇబ్బంది పడుతున్నారు అనే లెక్క. చరిత్ర చెప్తుంది కూడా అదే. జగన్ జైలుకి వెళ్ళిన సమయంలో కనిపించిన విజయమ్మ, 2014 ఎన్నికల సమయంలో కనిపించారు, మళ్ళీ 2019 ఎన్నికల్లో కనిపించారు. వైసీపీ గౌరవ అధ్యక్షరాలుగా విజయమ్మ ఉన్నా, డైలీ రాజకీయల్లో మాత్రం ఎక్కడా కనిపించరు. ఎన్నికల సమయంలో, జగన్ కు అవసరం అనుకుంటేనే కనిపిస్తారు. అయితే ఇప్పుడు మాత్రం అనూహ్యంగా, కొడుకు అధికారంలో ఉన్న మూడు నెలలకే, మళ్ళీ ప్రజల ముందుకు వచ్చారు. మీడియాతో మాట్లాడుతున్నారు. ఇలా విజయమ్మ ఇప్పుడు ఎందుకు వస్తున్నారు ? ప్రజలను ఇప్పుడు ఎందుకు డైవర్ట్ చెయ్యాలనుకుంటున్నారు ? అని విశ్లేషకులు ఆరా తీస్తున్నారు. అయితే విజయమ్మ మీడియాతో మాట్లాడిన మాటలు చూస్తూ, వైసిపీ అజెండా ఏంటో అర్ధమై పోతుంది.
విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ, జగన్ వంద రోజుల్లో ఎన్నో సాధించారని, వాళ్ళ నాన్న కంటే మంచి పేరు తెచ్చుకోవాలని తపన జగన్ కు ఉందని, అది సాదిస్తాడు అనే నమ్మకం ఉందని, ఆయన చెప్పిన పధకాలు అన్నీ అమలు చేస్తారనే విశ్వాసం ఉంది అంటూ, చెప్పుకొచ్చారు. అయితే ఒక్క విషయంలో మాత్రం, జగన్ ఆ హామీ నిలబెట్టుకోలేరేమో అంటూ ఒక మాట వేసి, అందరినీ తన మాటలు వినేలా చేసారు. జగన్ మోహన్ రెడ్డి పెట్టిన మద్యపాన నిషేధం అమలు చెయ్యటం ఎంతో కష్టమైన పని అని, జగన్ మోహన్ రెడ్డి అది సాదించలేరేమో అని తనకు అనిపిస్తుంది అంటూ విజయమ్మ చెప్పుకొచ్చారు. ఈ హామీ నిలబెట్టుకోవటం అన్ని రకాలుగా కష్టమని, ఈ విషయంలో తనకు అది సాధ్యపడదు అనే అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు.
అయితే ఇక్కడ విజయమ్మ చెప్పిన మాటలు మీడియాలో వచ్చాయి అంటే, అది జగన్ కు తెలియకుండా వచ్చే అవకాశమే లేదు. ఉద్దేశపూర్వకంగా, ప్రజలను నెమ్మదిగా ట్యూన్ చెయ్యటానికి, ఇలా చెప్పిస్తున్నారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆదాయం డౌన్ ట్రెండ్ లో ఉంది. 11 శాతం ఉన్న వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయింది. ఆదాయం పెరిగే అవకాశమే కనిపించటం లేదు. ఈ నేపధ్యంలో, ఒకే ఒక్క ఆదాయం వనరు అయిన మద్యం కూడా నిషేదిస్తే, పరిస్థితులు చేయి దాటి పోతాయానే అనుమానం రావటంతోనే, విజయమ్మ చేత మద్యపాన నిషేధం కష్టం అని చెప్పించి, ప్రజలను మానసికంగా ప్రిపేర్ చేస్తున్నట్టు అర్ధమవుతుంది. విజయమ్మ కూడా మద్యం ఆదాయం గురించి ప్రస్తావించారు అంటే, ఎదో ఉందనే తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధానం ఏంటో తెలిసిపోతుంది.